Site icon NTV Telugu

Harish Rao : వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి..

Harish Rao

Harish Rao

రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఆరోగ్య శాఖలోని అన్ని స్థాయిల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. అత్యవసర వైద్య సేవలకు ఎక్కడా అంతరాయం కలగకుండా చూసుకోవాలన్నారు. ముఖ్యంగా గర్బిణుల ఆరోగ్యాలపై దృష్టి సారించాలని, కేసీఆర్ కిట్ డేటా ఆధారంగా డెలివరీ డేట్ తెలుసుకొని ముందస్తుగా ఆసుపత్రులకు తరలించాలన్నారు. 102, 108 వాహన సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలన్నారు. పాముకాటు, కుక్కకాటు మందులను అన్ని పిహెచ్సీల్లో అందుబాటులో ఉంచామని, ఎక్కడా లేవు అనే మాట రావొద్దన్నారు. సీజనల్ వ్యాధులు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి, జిల్లా వైద్యాధికారులు పంచాయతీ, మున్సిపల్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా స్థాయిలో పరిస్థితులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, మలేరియా, డెంగీ కేసులు నమోదైతే తక్షణం వైద్య సేవలు అందేలా చూడాలన్నారు. అవసరమైన చోట ఓపీ సేవలు పెంచాలని, ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసి సేవలందించాలన్నారు.

Also Read : Allu Arjun: ఐకాన్ స్టార్ కోలీవుడ్ ఎంట్రీ.. జవాన్ డైరెక్టర్ తో.. ?

ఇదిలా ఉంటే.. బంగాళాఖాతంలో కోస్తాంధ్ర తీరంపై అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అల్పపీడన ప్రాంతం నుంచి తెలంగాణ మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్‌ పరిసరాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కేరళ, కర్ణాటకలకూ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. కొన్ని చోట్ల పిడుగులు, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.

Tata Nexon facelift 2023: నెక్సాన్ ఫేస్‌లిఫ్గ్.. ధర, లాంచ్ డేట్, బుకింగ్స్ వివరాలు..

Exit mobile version