Tata Nexon facelift 2023: ఇండియాలో మోస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీ కార్లలో టాటా నెక్సాన్ టాప్ ప్లేస్ లో ఉంటుంది. ఇప్పుడు ఈ కారు నెక్సాన్ కొత్త రూపంలో మార్కెట్ లోకి వస్తోంది. నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ 20223గా మార్కెట్ లోకి రాబోతోంది. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో లక్షలకు మించి నెక్సాన్ కార్లు అమ్ముడయ్యాయంటే ఈ కార్ సత్తా ఏంటో తెలుస్తోంది. 2023లో 1,72,139 యూనిట్లు, 2022లో 1,24,130 యూనిట్లు అమ్ముడయ్యాయి. తాజాగా వస్తున్న ఫేస్‌లిఫ్ట్ వరెర్షన్ మరిన్ని ఫీచర్లనతో రాబోతోంది.
సబ్ 4 మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్ లో టాటా నెక్సాన్ కు పోటీ ఇచ్చే కారే లేదు. తక్కువ ధరలతో ఎక్కువ ఫీచర్లు ఇస్తుండటం, గ్లోబల్ MCAP రేటింగ్స్ లో అత్యంత సేఫ్టీ కలిగి కారుగా 5 స్టార్ రేటింగ్ సాధించింది. ఇవన్ని కొనుగోలుదారులను నెక్సాన్ వైపు ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న హ్యుందాయ్ వెన్యూ, మహీంద్రా ఎస్‌యూవీ 300, కియా సోనెట్ లకి కొత్త నెక్సాన్ పోటీ ఇస్తుంది.
లాంచ్ తేదీ, ధర, బుకింగ్స్:
నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ 2023 సెప్టెంబర్ 14న భారత మార్కెట్ లోకి లాంచ్ అవబోతోంది. మొత్తం 11 వేరియంట్లలో ఈ కార్ అందుబాటులో ఉండనుంది. క్రియేటివ్, క్రియేటివ్+, క్రియేటివ్+ S, ఫియర్‌లెస్, ఫియర్‌లెస్ S, ఫియర్‌లెస్+ S, ప్యూర్, ప్యూర్ S, స్మార్ట్ స్మార్ట్+ , స్మార్ట్+ S వేరియంట్లు ఉండనున్నాయి. ధరను పరిశీలిస్తే రూ.8 లక్షల నుంచి రూ. 15 లక్షలు(ఎక్స్ షోరూం) వరకు ఉండవచ్చని అంచానా వేస్తున్నారు. ప్రస్తుతం నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.
ఫీచర్లు:
ఫీచర్ల విషయానికి వస్తే గతంతో పోలిస్తే ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ లో టెక్ ఫీచర్లు ఎక్కువగా ఉన్నాయి. సీక్వెన్షియల్ LED DRLలతో రాబోతోంది. బైఫంక్షనింగ్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ తో రాబోతోంది. 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్, లెథెరెట్ ఆర్మ్ రెస్ట్, టూ స్పోక్ స్టీరింగ్ వీల్, 10.25 ఇంచ్ ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కొత్త నెక్సాన్ కి మరింత అట్రాక్షన్ ఇవ్వనుంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌పై నావిగేషన్ డిస్‌ప్లే, వాయిస్-అసిస్టెడ్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఎయిర్ ప్యూరిఫైయర్, కూల్డ్ గ్లోవ్ బాక్స్ మరియు వైర్‌లెస్ ఛార్జర్ ఉన్నాయి.
ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్‌లతో కూడిన 360-డిగ్రీ సరౌండ్ వ్యూ సిస్టమ్, బ్లైండ్ వ్యూ మానిటర్, ESP, TPMS, రెయిన్ సెన్సింగ్ వైపర్‌లతో కూడిన ఆటో హెడ్‌ల్యాంప్‌లు, కార్నరింగ్ ఫంక్షన్‌తో ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి.
ఇంజన్ వివరాలు:
ప్రస్తుతం నెక్సాన్ లో ఉన్న విధంగానే ఇంజన్ ఆప్షన్స్ ఇచ్చింది. Revotron 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంది. ఇది 120 పీఎస్ శక్తని, 170 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. Revotorq 1.5-లీటర్ డీజిల్ ఇంజన్, 115 పీఎస్ శక్తిని, 260ఎన్ఎం టార్క్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. 6 స్పీడ్ ఏఎంటీ, 5 స్పీడ్ ఎంటీ, 7 స్పీడ్ డీసీఏ ట్రాన్స్‌మీషన్ ఆప్షన్లు ఉన్నాయి. డిజిల్ ఇంజన్ లో ఇప్పటికే 6 స్పీడ్ ఎంటీ ఉండగా.. ఇప్పుడు 6 స్పీడ్ ఏఎంటీ ఛాయిస్ లను కలిగి ఉంది.