NTV Telugu Site icon

PAK vs BAN: 193 పరుగులకే బంగ్లాదేశ్ ఆలౌట్

Pak Vs Ban

Pak Vs Ban

PAK vs BAN: లాహోర్‌లోని గడాఫీ స్టేడియం వేదికగా బుధవారం జరుగుతున్న ఆసియా కప్‌లోని మొదటి సూపర్‌4 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను పాకిస్థాన్ 193 పరుగులకే కట్టడి చేసింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా జట్టు 193 పరుగులకే ఆలౌట్ కావడం గమనార్హం. పాక్‌ బౌలర్ హారిస్‌ రవూఫ్‌ నాలుగు వికెట్లను తీసి బంగ్లాదేశ్‌ జట్టును కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు. బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్‌(53), వికెట్ కీపర్‌ ముష్పికర్‌ రహీమ్‌(64)లు అర్థశతకాలు బాదడంతో బంగ్లా జట్టు గౌరవప్రదమైన స్కోరును సాధించగలిగింది.

Also Read: Asia Cup 2023: శ్రీలంక వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. ఇక మ్యాచ్లకు ఇబ్బందేమీ లేదు

పాకిస్థాన్‌ బౌలర్లందరూ బంగ్లా బ్యాటర్లను చాలా వరకు ఇబ్బంది పెట్టారు. అయితే హారిస్‌ రవూఫ్ నాలుగు వికెట్లు తీయగా, నసీమ్ మూడు వికెట్లు తీయడంతో బంగ్లాదేశ్ 193 పరుగులకే ఆలౌటైంది. వీరితో పాటు షాహీన్ అఫ్రిది, ఇఫ్తికార్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్ ఒక్కో వికెట్ తీశారు.