Site icon NTV Telugu

Harirama Jogaiah: పవన్‌ కల్యాణ్‌కు హరిరామ జోగయ్య బహిరంగ లేఖ.. ఇప్పుడు వాటిపై..!

Harirama Jogaiah

Harirama Jogaiah

Harirama Jogaiah: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు ఇప్పటికే వివిధ అంశాలపై లేఖలు రాస్తూ వచ్చిన మాజీ మంత్రి, కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు చేగొండి హరిరామ జోగయ్య.. ఇప్పుడు పవన్‌కు బహిరంగ లేఖ రాశారు.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని అధికారం నుంచి దించడమంటే చంద్రబాబును అధికారంలోకి తేవటమా? అని ప్రశ్నించారు. చంద్రబాబుకు అధికారం కోసం కాపులు.. పవన్‌ కల్యాణ్‌ వెంట నడవడం లేదన్న ఆయన.. దామాషా ప్రకారం సీట్ల కేటాయింపు లేకపోతే రాష్ట్ర ప్రయోజనాలు ఎలా కాపాడుతారు? అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో 40 నుండి 60 స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేయాలని సూచించారు. అధికారంలోకి వస్తే రెండున్నర ఏళ్లు.. పవన్‌ కల్యాణ్‌ ముఖ్యమంత్రి అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించాలని లేఖ ద్వారా డిమాండ్‌ చేశారు. జనాభా ప్రాతిపదికన సీట్ల కేటాయింపు జరగకపోతే జరిగే నష్టానికి మీరే సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు చేగొండి హరిరామ జోగయ్య.

Read Also:Ram Gopal Varma: వర్మ ఒళ్లో మరో అందమైన భామ.. ఎవరో తెలుసా?

ఇక, స్వాతంత్ర్యం వచ్చి నాటి నుంచి నేటి వరకు ఒక్క దామోదరం సంజీవయ్య మినహా ఇప్పటి వరకు అగ్రవర్ణాలలో 6 శాతం జనాభా ఉన్న రెడ్డి కులస్తులు, 4 శాతం ఉన్న కమ్మ కులస్తులు తప్ప 80 శాతం ఉన్న మిగిలిన బడుగు, బలహీనవర్గాల వారెవ్వరూ ముఖ్యమంత్రి పదవులు అధిష్టించి పరిపాలనా అధికారం చేపట్టిన వారు ఎవరూ లేరని పేర్కొన్నారు హరిరామ జోయ్యగ.. ఇక, ఆనాటి నుంచి 25 శాతం ఉన్న కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులస్తులకు, బీసీ కులస్తులుగా గుర్తింపు పనొందకుండా విద్య, ఉద్యోగ, రాజకీయాలలో రిజర్వేషన్స్‌ సౌకర్యం పొందకుండా అడ్డుకుంటున్నారనేది వాస్తవం.. యాచించే స్థితి నుంచి శాసించే స్థితికి రావాలంటే రాజ్యాధికారం దక్కించుకోవడం తప్ప వేరే మార్గలం లేదని గ్రహించిన కాపు సామాజికవర్గం ఈ దిశగా ప్రయాణం చేయటానికి ప్రయత్నిస్తూనే ఉన్నాయని.. ప్రజలలో మంచి చరిష్మా కలిగి పవన్‌ కల్యాణ్.. జనసేన పార్టీని స్థాపించి రాజ్యాధికారం దక్కించుకునే దిశగా చేస్తున్న ప్రయాణంలో.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను కూడా కలుపుకుని.. ఆయనకు పూర్తి సహకారం అందిస్తూ.. ఆయనతో కలిసి ముందుకు నడుస్తున్న మాటను కాదనలేమని తన లేఖలో పేర్కొన్నారు హరిరామ జోగయ్య.. ఇక, మాజీ మంత్రి, కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు చేగొండి హరిరామ జోగయ్య.. రాసిన పూర్తి లేఖకు కింద జత చేయడం జరిగింది.

 

Exit mobile version