AP Deputy CM Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్‌కు హరిరామ జోగయ్య లేఖ.. సినిమాలు మానేయొద్దు..
- పవన్ కల్యాణ్‌కు చేగొండి హరిరామ జోగయ్య..
- కూటమి ఏర్పాటు ద్వారా సీఎం అయిన చంద్రబాబుకు.. డిప్యూటీ సీఎం అయిన పవన్ కల్యాణ్‌కు శుభాకాంక్షలు తెలిపిన జోగయ్య..
- మీ హయాంలో అభివృద్ధి.. సంక్షేమం రెండు సమపాలల్లో పరుగులు పెట్టాలనా ఆకాంక్ష..
- కాపులు ఆశిస్తున్న 5 శాతం రిజర్వేషన్లను మీ పాలనలో అమలు చేయాలన్న జోగయ్య..
- సినిమాలు మానేయకుండా సగం రోజులు సినిమాలకు.. సగం రోజులు పరిపాలనకు కేటాయించాలని సూచన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల ముందు నుంచి వరుసగా లేఖలు రాస్తూ వస్తున్నారు కాపు బలిజ సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య.. పొత్తుల విషయంలో.. సీట్ల విషయంలో.. అధికారం పంచుకునే విషయంలో.. ఇలా అనేక సూచనలు చేస్తూ వచ్చారు.. అయితే, ఇప్పుడు జనసేన అధినేత, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్.. ఫుల్‌టైం పొలిటీషియన్‌గా మారడంతో.. సినిమాలు చేస్తారా? లేదా? అనే చర్చ సాగుతోంది.. ఈ నేపథ్యంలో.. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు మాజీ ఎంపీ, కాపు బలిజ సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య రాజకీయ విశ్లేషణ లేఖ రాశారు.. కూటమి ఏర్పాటు ద్వారా ముఖ్యమంత్రి అయిన చంద్రబాబుకు, ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కల్యాణ్‌కు శుభాకాంక్షలు తెలియజేసిన ఆయన.. మీ హయాంలో అభివృద్ధి, సంక్షేమం రెండు సమపాలల్లో పరుగులు పెట్టస్తారని ఆశిస్తున్నాను అన్నారు.
Read Also: Virat Kohli: జస్ప్రీత్ బుమ్రా పిటిషన్‌పై నేను సంతకం చేస్తా: కోహ్లీ
Also Read
- PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
- OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
ఇక, ప్రధానంగా కాపులు ఆశిస్తున్న ఐదు శాతం రిజర్వేషన్లను మీ పాలనలో అమలు చేస్తారని ఆశిస్తున్నాను అని లేఖలో పేర్కొన్నారు జోగయ్య.. కృష్ణా జిల్లాకు వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలని కోరారు.. మీరు సినిమాలు మానేయకుండా సగం రోజులు సినిమాలకు, సగం రోజులు పరిపాలనకు కేటాయించాలనీ నా సూచన అంటూ ఆ లేఖలో రాసుకొచ్చారు.. మరోవైపు.. నిర్వీరియమైన జిల్లా పరిషత్, మండల పరిషత్, పంచాయతీ వ్యవస్థలను బలోపేతం చేయాలని లేఖలో సూచించారు చేగొండి హరిరామ జోగయ్య..మొన్న ఈ మధ్యే సినిమాలపై క్లారిటీ ఇచ్చారు పవన్ కల్యాణ్.. OG, OG అంటూ ఫ్యాన్స్ అవరడంతో.. నవ్వూతూ స్పందించిన పవన్ కల్యాణ్.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రజలకు మెరుగైన పాలనపై దృష్టి కేటాయించామని.. ఈ సమయంలో మనం ప్రజలకు చేయాల్సిన పనులు వదిలేసి సినిమా షూటింగ్ లో పాల్గొంటే ప్రతిపక్షాలు ప్రశ్నిస్తాయన్నారు.. నన్ను నమ్మి ఇంతటి భారీ విజయాన్ని అందించిన ప్రజలకు సేవ చేసుకుంటూ కుదిరినప్పుడల్లా నెలలో రెండు, మూడు రోజులు సినిమా షూటింగ్‌లో పాల్గొంటానని పవన్ కల్యాణ్ స్పష్టత ఇచ్చిన విషయం విదితమే.
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!