Lunar Eclipse: రేపే సంపూర్ణ చంద్రగ్రహణం.. భారత్ లో కనిపిస్తుందా?
- రేపే సంపూర్ణ చంద్రగ్రహణం..
- ఉదయం 9:29 గంటలకు మొదలై మధ్యాహ్నం 3:39 గంటల వరకు.
- దాదాపు 6 గంటల పాటు గ్రహణ దశ .
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lunar Eclipse: చంద్రగ్రహణం అంటే మనం చిన్నప్పుడు స్కూల్ లో చదివే ఉంటాము. భూమి, సూర్యుడు, చంద్రుడు మూడు ఒకే సరళరేఖలోకి వచ్చిన సమయంలో ఏర్పడే ఒక ఖగోళ సంఘటన. ఇక చంద్రగ్రహణం విషయానికి వస్తే.. భూమి సూర్యుని కాంతిని చంద్రుడిపైకి వెళ్ళకుండా అడ్డుకోవడం ద్వారా ఇది ఏర్పడుతుంది. చంద్రుని కక్ష్య, భూమి నీడ పడే విధానం ఆధారంగా ఇది సంపూర్ణ చంద్రగ్రహణం లేదా అర్ధ చంద్రగ్రహణంగా ఏర్పడుతుంది.
Read Also: Uttam Kumar Reddy : దళిత స్పీకర్‌ను అవమానపరిచేట్లు మాట్లాడడం సరికాదు
Also Read
- JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
- Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
- Easy Egg Peeling Tips: ఉడికించిన గుడ్లను సులభంగా ఒలిచే సింపుల్ పద్ధతి.. ఈ చిన్న పొరపాట్లు చేయకండి!
ఇక సంపూర్ణ చంద్రగ్రహణం సమయంలో భూమి నీడ చంద్రుడిని పూర్తిగా కప్పివేస్తుంది. దీని కారణంగా చంద్రుడు ఎరుపు లేదా నారింజ రంగులోకి కనిపిస్తాడు. కాగలాలంలో ఏర్పడే ఈ ప్రత్యేక దృశ్యాన్ని ‘బ్లడ్ మూన్’ అని పిలుస్తారు. ఇకపోతే ఈ ఏడాది మొదటి గ్రహణం హోలీ పండుగ రోజు అంటే మార్చి 14న ఏర్పడనుంది. ఇక హోలీ నాడు ఏర్పడేది సంపూర్ణ చంద్రగ్రహణం.
ఇక చంద్రగ్రహణంరోజు భూమి నీడ చంద్రునిపై ఏకంగా 99.1% వరకు కప్పేయనుంది. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం భారత కాలమానం ప్రకారం, మార్చి 14న ఉదయం 9:29 గంటలకు మొదలై మధ్యాహ్నం 3:39 గంటలకు అయిపోనుంది. ఇక మధ్యాహ్నం 12:29 గంటలకు ఈ సంపూర్ణ చంద్రగ్రహణం గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. అలాగే ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఉదయం 11:57 గంటలకు మొదలై మధ్యాహ్నం 1:01 గంటలకు ముగుస్తుంది. ఇలా మొత్తంగా గ్రహణ దశ దాదాపు 6 గంటల పాటు ఉండనుంది.
Read Also: Sankranthiki Vasthunam: టీఆర్పీ రేటింగ్స్‌లో “సంక్రాంతికి వస్తున్నాం” సరి కొత్త రికార్టు
ఇక ఈ సంపూర్ణ చంద్రగ్రహణం చాలా ప్రాంతాల్లో స్పష్టంగా కనిపించనుంది. ముఖ్యంగా ఉత్తర, దక్షిణ అమెరికా, పశ్చిమ ఐరోపా, ఆఫ్రికా దేశాల్లో గ్రహణాన్ని ప్రత్యక్షంగా వీక్షించగలరు. భారతదేశంలో గ్రహణ సమయానికి పగలు కావడం వల్ల ఇది అసలు కనిపించదు. ఐరోపాలో చంద్రుడు అస్తమించే సమయంలో గ్రహణం కొనసాగుతుండగా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో చంద్రుడు ఉదయించే సమయానికి గ్రహణం ముగియనుంది.
తాజావార్తలు
-
JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
-
Thattanchavady Bypoll Result: తట్టాంచావడి ఉప ఎన్నిక ఫలితం.. 8,482 ఓట్ల మెజారిటీతో అశోక్ ఆనంద్ ఘన విజయం!
-
Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
-
Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!