NTV Telugu Site icon

Hardik Pandya: టీమ్లో చేరుతాడు కానీ.. ఆ మ్యాచ్కు కష్టమే..!

Hardik

Hardik

గాయం నుంచి కోలుకుంటున్న హార్దిక్ పాండ్యా తర్వాతి మ్యాచ్‌లో జట్టులో చేరనున్నాడు. నవంబర్ 2న ముంబైలో శ్రీలంకతో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్ వరకు జట్టులోకి వస్తాడు కానీ.. మ్యాచ్ ఆడుతాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఇప్పటికే అతని స్థానంలో సూర్యకుమార్ యాదవ్ జట్టులోకి తీసుకోగా.. న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో కీలక సమయంలో ముఖ్యమైన పరుగులు చేశాడు.

Read Also: Mohammed Siraj: వరల్డ్కప్ టోర్నీలో ఫామ్లో లేని స్టార్ బౌలర్.. తర్వాతి మ్యాచ్లకు కష్టమే..!

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం టీమిండియా అద్భుతమైన ఫామ్‌లో ఉంది. ఇంగ్లండ్‌పై తిరుగులేని విజయం సాధించింది. ఆ క్రెడిట్ అంతా ఫాస్ట్ బౌలర్లకే దక్కుతుంది. మహ్మద్ షమీ రెండు మ్యాచ్‌ల్లో 9 వికెట్లు పడగొట్టి తన పేస్‌తో విధ్వంసం చేస్తున్నాడు. ఇక.. జస్ప్రీత్ బుమ్రాను ఎదుర్కోవడం బ్యాట్స్‌మెన్‌కు కష్టమైన పనిగా మారుతుంది. స్పిన్‌ విభాగంలో కుల్‌దీప్‌ యాదవ్‌ మాయజాలం చేస్తున్నాడు. బ్యాటింగ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ మంచి ఆరంభాన్ని అందిస్తున్నాడు. ఇక విరాట్ కోహ్లీ కూడా అద్భుతమైన బ్యాటింగ్ చేస్తున్నాడు. శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్‌ల ఫామ్ మాత్రం జట్టుకు ఆందోళన కలిగించే అంశంగా ఉంది.

Read Also: Govt Hospital: కరెంట్ బిల్లు కట్టలేదని కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో సిటీ స్కాన్, ఎమ్ఆర్ఐ కేంద్రాలకు తాళం

IND vs SL ప్లేయింగ్ ఎలెవన్ అంచనా..
రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్/శార్దూల్ ఠాకూర్.