ఎవరన్న కరెంట్ బిల్లు కట్టకపోతే విద్యుత్ శాఖ అధికారులు కనెక్షన్ కట్ చేసేస్తారు. అలాంటిది ప్రభుత్వానికి సంబంధించినవి స్కూల్స్, హస్పటల్స్ అయినా.. సరే వారి తీరు అలాగే ఉంటుంది. అయితే, తాజాగా నిరంతరం పేదలకు చికిత్స అందించే ప్రభుత్వ ఆస్పత్రికి కూడా విద్యుత్ శాఖ అధికారులు షాక్ ఇచ్చారు. గత కొన్ని నెలలుగా కరెంట్ బిల్లు కట్టడం లేదని సదరు హస్పటల్ కు కరెంట్ కనెక్షన్ కట్ చేశారు. అయితే, ఈ ఘటన మన పక్క రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ లోని కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చోటు చేసుకుంది.
Read Also: Varun Tej Lavanya Tripathi : వరుణ్ తేజ్, లావణ్య పెళ్లికి వెళ్లేవాళ్లు ఈ బట్టలే ధరించాలట!
కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోకి విద్యుత్ శాఖ అధికారులు తాళం వేశారు. అయితే, గత కొంత కాలంగా కరెంట్ బిల్లు చెల్లించడం లేదని సిటీ స్కాన్, ఎమ్ఆర్ఐ కేంద్రాలకు కలెక్టర్ సృజన తాళం వేయించింది. ఏడాదిగా బిల్లులు రాలేదని, కొంత సమయం ఇస్తే విద్యుత్ బిల్లులు చెల్లిస్తామని కలెక్టర్ కు ఏజెన్సీ ప్రతినిధులు తెలిపారు. అయినా ఎమ్ఆర్ఐ, సిటీ స్కాన్ కేంద్రాలకు అధికారులు లాక్ వేసేశారు. రోగులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ఎలా మూసివేస్తారని అధికారులను హస్పటల్ లో ఉన్న రోగులు నిలదీస్తున్నారు. అత్యవసర పరీక్ష కేంద్రాలను మూసివేయడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రి అధికారులు వెంటనే స్పందించి సిటీ స్కాన్, ఎమ్ఆర్ఐ కేంద్రాలను తెరిపించాలని పేషెంట్స్ కోరుతున్నారు.
Read Also: Phone Hacking: యాపిల్ సంస్థ నుంచి ప్రతిపక్ష ఎంపీలకు అలర్ట్.. కేంద్రం హ్యాక్ చేస్తోందని ధ్వజం
జీజీహెచ్ లో సిటీ స్కాన్ సెంటర్ ముందు రోగులు, సీపీఐ ఆందోళనకు దిగారు. సిటీ స్కాన్, ఎంఆర్ఐ కేంద్రాలు మూసివేయడంపై ఆందోళన చేస్తున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా సిటీ స్కాన్, ఎంఆర్ఐ ఎలా మూసి వేస్తారని రోగులు ప్రశ్నించారు. సిటీ స్కాన్, ఎంఆర్ఐ కేంద్రాలను వెంటనే తెరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.