Hardik Pandya Resumes Bowling Practice Ahead Of IPL 2024: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం కారణంగా ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 నుంచి అర్ధతరంగా తప్పుకున్న విషయం తెలిసిందే. పుణెలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ చీలమండకు గాయమైంది. హార్దిక్ ప్రస్తుతం వేగంగా కోలుకుంటున్నాడు. ఫిట్‌నెస్ సాధించిన అతడు నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ మొదలెట్టాడు. బరోడా క్రికెట్ స్టేడియంలో నెట్స్‌లో చెమటోడ్చాడు. బౌలింగ్ చేస్తున్న వీడియోను పాండ్యా తహ ఎక్స్ ఖాతాలో షేర్ చేశాడు. బరోడా క్రికెట్ స్టేడియం తనకు గుడితో సమానం అని పేర్కొన్నాడు.
‘నాకు ఎంతో ఇష్టమైన ప్లేస్‌కు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. బరోడా క్రికెట్ స్టేడియం నాకు ఒక దేవాలయం లాంటింది. ఎందుకంటే.. ఇదే మైదానంలో నేను చాలా విషయాలు నేర్చుకున్నా. ఈ మైదానం నాకు నేర్పినది వెలకట్టలేనిది. 17 ఏళ్ల క్రితం క్రికెటర్‌గా నా జర్నీ ఇక్కడే మొదలైంది. మళ్లీ ఇక్కడికి వచ్చినందుకు ఆనందంగా ఉన్నా’ అని హార్దిక్ పాండ్యా తెలిపాడు. ఈ పోస్ట్ చూసిన భారత ఫాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ పోస్ట్‌కి లైక్‌ల వర్షం కురుస్తోంది.
Also Read: IND vs ENG: రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ ఆలౌట్.. భారత్ లక్ష్యం ఎంతంటే!
ఐపీఎల్ 2024 ఎడిషన్‌లో ఆల్‌రౌండర్ పాండ్యా ముంబై ఇండియన్స్‌కు హార్దిక్ పాండ్యా నాయకత్వం వహించనున్నాడు. ఐపీఎల్ 2023లో గుజరాత్ టైటాన్స్‌ను ఫైనల్‌కు చేర్చిన పాండ్యాను 17వ సీజన్‌కు ముందు ముంబై కొనుగోలు చేసింది. రోహిత్ శర్మను కెప్టెన్‌గా తప్పించి.. అతడికి బాధ్యతలు అప్పగించింది. అయితే టోర్నీ మొదలయ్యే సరికి హార్దిక్ ఫిట్‌గా ఉంటాడా? లేదా? అన్నది చూడాలి. ఏదేమైనా త్వరలోనే పునరాగమనం చేసేందుకు హార్థిక్ సిద్ధంగా ఉన్నాడు. ఐపీఎల్ 2024కు ఇంకా దాదాపు 2 నెలల సమయం ఉన్నందుకు ఏం జరుగుతుందో చూడాలి.
Giving it all I got, every single day ✌️💥 pic.twitter.com/hYwk7oNOoL
— hardik pandya (@hardikpandya7) January 27, 2024