NTV Telugu Site icon

IPL 2025: హార్దిక్‌ను విడుదల చేసి.. ఆ ముగ్గురిని ఉంచుకోండి

Hardhik

Hardhik

ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు టీమిండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా కీలక వ్యాఖ్యలు చేశారు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను విడుదల చేయాలని జట్టుకు సలహా ఇచ్చాడు. అవసరమైతే విడుదలైన తర్వాత రైట్ టు మ్యాచ్ కార్డ్ ఉపయోగించి తిరిగి తీసుకోవచ్చని అన్నాడు. కాగా.. సెప్టెంబర్ 28న ఐపీఎల్ రిటెన్షన్‌కు సంబంధించి కొత్త నిబంధనలు వచ్చాయి. ఇందులో ఆర్టీఎం కార్డ్‌లు ఉన్నవారితో సహా 6 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు.

Grand Celebrations: తెలుగు హీరోయిన్‌కి గ్లామన్ మిసెస్ ఇండియా 2024 అవార్డు.. గ్రాండ్ సెలబ్రేషన్స్

ముంబై ఇండియన్స్ వద్ద చాలా మంది స్టార్ ప్లేయర్‌లు ఉన్నందున కాస్త రిస్క్ తీసుకోవాల్సి ఉంటుందని అజయ్ జడేజా సూచించారు. ముంబయి మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రాలను కొనసాగించాలని.. పాండ్యాను విడుదల చేయాలని తద్వారా వేలంలో తిరిగి తీసుకోవచ్చని తెలిపారు. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా ముగ్గురు ఆటగాళ్లని ముంబై ఖచ్చితంగా రిటైన్ చేస్తుందని జడేజా అన్నారు. ఈ ఆటగాళ్లు వేలంలోకి వెళితే వారిని కొనడం అసాధ్యం.. ముంబై ఇండియన్స్ ఆర్టీఎం కార్డును హార్దిక్ పాండ్యా కోసం ఉపయోగిస్తుందని తాను భావిస్తున్నట్లు చెప్పారు.

Rajnath Singh: భారత్‌తో పాక్ స్నేహంగా ఉంటే.. ఐఎంఎఫ్ కన్నా ఎక్కువ డబ్బులు ఇచ్చే వాళ్లం..

ఈసారి ఐపీఎల్‌లో కొత్త నిబంధన ఉంది. ఈ నిబంధనలో ఆర్టీఎం కార్డ్ అమలు తర్వాత.. ఇతర జట్లకు వేలం వేయడానికి మరొక అవకాశం లభిస్తుంది. తమ జట్టులో ఆడిన ఆటగాడు వేలంలో అందుబాటులో ఉంటే అతడిని తిరిగి పొందడానికి ఫ్రాంచైజీలు ఆర్టీఎం కార్డును ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకు ఒక ఆటగాడు వేలంలో రూ. 16 కోట్ల ధర పలికాడని అనుకుందాం. వేలంలో ఏ జట్టు అతడిని కొనుగోలు చేయడానికి ప్రయత్నించినప్పటికీ.. ఆర్టీఎం కార్డుని ఉపయోగించి పాత ఫ్రాంచైజీయే అతడిని దక్కించుకోవచ్చు. అంటే బిడ్డింగ్‌లో గరిష్ఠంగా ఎంత ధర పలికితే అంత ధరకు తిరిగి జట్టులోకి తీసుకోవడం అన్నమాట. ఈ ప్రక్రియలో ఆటగాళ్ల ధర పెరగవచ్చు లేదా తగ్గవొచ్చు. అవకాశాన్ని బట్టి పాత ఫ్రాంచైజీలే తిరిగి దక్కించుకునేందుకు వీలు కల్పిస్తుంది.