HanuMan : ఓటీటీలోకి వచ్చేస్తున్న హనుమాన్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన మూవీ హనుమాన్..సంక్రాంతి కానుకగా జనవరి 12న హనుమాన్ మూవీ విడుదలైన సంగతి తెలిసిందే. మహేశ్ బాబు గుంటూరు కారం వెంకటేష్ సైంధవ్ మరియు నాగార్జున నా సామిరంగ వంటి బిగ్ సినిమాలతో పాటు సంక్రాంతి బరిలోకి దిగింది హనుమాన్..చిన్న సినిమాగా వచ్చిన హనుమాన్ మూవీ భారీ సక్సెస్ అందుకుంది. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ మూవీ ప్రేక్షకుల నుంచి ఆదరణ పొంది భారీ విజయం సాధించింది. తెలుగుతోపాటు తమిళం, మరాఠీ, హిందీ, కన్నడ, ఇంగ్లీష్, స్పానిష్, చైనీస్, కొరియన్ మరియు జపనీస్ భాషల్లో రిలీజ్ చేసిన పాన్ వరల్డ్ మూవీగా రిలీజైన హనుమాన్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ఇప్పుడు మూవీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.అయితే, హనుమాన్ ఓటీటీ హక్కులను ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ జీ5 దక్కించుకుంది.
ఇక హనుమాన్ ఓటీటీ స్ట్రీమింగ్పై అనేక రకాల వార్తలు వచ్చాయి. మొదట్లో ఈ సినిమాను ఓటీటీలో ఫిబ్రవరిలోనే రిలీజ్ చేద్దామని అనుకున్నారు. కానీ, అప్పటికీ ప్రేక్షకులు థియేటర్లలో హనుమాన్ను చూడటంతో మార్చి నెలకు వాయిదా వేశారు. మొదట మార్చి 1 లేదా 2వ తారీఖున హనుమాన్ మూవీని ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నట్లు వార్తలు వచ్చాయి.దీంతో సమయం దగ్గరపడుతున్న కొద్ది ప్రేక్షకులు తెగ ఎదురుచూశారు. తీరా ఆ సమయం వచ్చేసరికి ఈ రెండు తేదీలు కాకుండా మరో తేదీని అధికారికంగా ప్రకటించింది జీ5 ఓటీటీ సంస్థ. హనుమాన్ మూవీని ఇంకాస్తా లేటుగా మార్చి 8 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తాజాగా జీ5 అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చింది. మార్చి 8న మహాశివరాత్రి పండుగతోపాటు ఆరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. వీటి సందర్భంగా ఆరోజు నుంచి ఓటీటీలో హనుమాన్ మూవీని స్ట్రీమింగ్ కానుంది.ఇదిలా ఉంటే, హనుమాన్ మూవీ పాన్ ఇండియా స్థాయిలో బిగ్గెస్ట్ హిట్ కావటంతో దానికి తగినట్లుగానే జీ5 సంస్థ ఓటీటీ హక్కులు భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం.
Also Read
- Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
- Thalliki Vandanam: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వారికి కూడా ‘తల్లికి వందనం’ వర్తింపు..
- Bullet Train: బుల్లెట్ ట్రైన్ ఆలస్యానికి భారతే కారణం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలు..
- Trump: భారత్ విద్యార్థులకు బిగ్ షాక్.. ట్రంప్ కొత్త స్టూడెంట్ వీసా నిబంధనలివే!
Hanuman To premier on @zee5India from March 8th.#Hanuman #Prasanthvarma #tejasajja #varalaxmisarathkumar #amrithaaiyer@PrasanthVarma @tejasajja123 @varusarath5 @Actor_Amritha pic.twitter.com/5WeWlKRFCV
— the.cineholic (@the_cine_holic) March 1, 2024
తాజావార్తలు
-
Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
-
Thalliki Vandanam: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వారికి కూడా ‘తల్లికి వందనం’ వర్తింపు..
-
Pallaburusu: టూత్‌బ్రష్‌తో జిల్లా కోర్టులో లీగల్ ఫైట్?
-
Bullet Train: బుల్లెట్ ట్రైన్ ఆలస్యానికి భారతే కారణం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలు..
-
Trump: భారత్ విద్యార్థులకు బిగ్ షాక్.. ట్రంప్ కొత్త స్టూడెంట్ వీసా నిబంధనలివే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?