Hansika : హన్సిక పై మండిపడుతున్న నెటిజన్ల..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండే హీరోయిన్ హన్సిక, సినిమా ఇండస్ట్రీలోని చీకటి కోణం ‘క్యాస్టింగ్ కౌచ్’పై స్పందించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పరిశ్రమలో ఎంతోమంది నటీమణులు తమకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంటూ పోరాడుతుంటే, హన్సిక మాత్రం సింపుల్ గా ‘నాకైతే తెలియదు’ అని దాటవేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read : Alia Bhatt: పాకిస్థానీ బ్రాండ్‌కు అలియా భట్ ప్రచారం? నెట్టింట వైరల్ అవుతున్న ఫొటోలు
Also Read
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో హోస్ట్ క్యాస్టింగ్ కౌచ్ గురించి ప్రశ్నించగా.. హన్సిక మాట్లాడుతూ.. ‘నిజంగా పని చేయలని మనస్ఫూర్తిగా అనుకునే వారికి, నిజమైన టాలెంట్ ఉన్న వారికి ఇలాంటివి ఎదురవుతాయని నేను అనుకోను. నా విషయంలో ఎప్పుడూ ఇలా జరగలేదు’ అని చెప్పుకొచ్చింది. పరిశ్రమలో ఇలాంటివి జరుగుతున్నాయన్నది వాస్తవం కదా అని హోస్ట్ గుర్తూ చేసినా కూడా.. ‘దాని గురించి నాకు అవగాహన కూడా లేదు, కాబట్టి నేను కామెంట్ చేయలేను’ అని ఆమె ఆ విషయాన్ని విస్మరించింది. ఈ మాటలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో..
నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు. ‘మీకు డయబెటీస్ లేనంత మాత్రాన, అసలు ఆ వ్యధే లేదని చెప్పడం ఎంత ముర్ఖత్వమో మీ మాటలు కూడా అలాగే ఉన్నాయి’ అని ఒక యూజర్ ఘాటుగా స్పందించారు. అంతే కాదు టాలెంట్ ఉంటే ఇలాంటివి జరగవు అని అనడం ద్వారా, బాధితులను హన్సిక అవమానిస్తోందని మరికొందరు మండిపడుతున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టి ఒక రక్షణ వలయంలో ఉండటం వల్లే హన్సికకు బయటి ప్రపంచం తెలియడం లేదని విమర్శలు వస్తున్నాయి.
తాజావార్తలు
-
TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
-
Bhu Bharati: రైతులకు ఊరట.. భూ సమస్యలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.!
-
El Nino : తెలంగాణలో సెప్టెంబర్ సెగ.. 2 రోజుల్లో మరో 2 డిగ్రీలు పెరిగే ఛాన్స్.!
-
Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
-
Nepal Floods: నేపాల్‌లో జల ప్రళయం.. విరిగిపడ్డ కొండచరియలు.. మూడు రోజుల్లో ఎంత మంది చనిపోయారంటే!
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!