హన్సిక మోత్వానీ. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా తన సినీ కెరీర్ ను ప్రారంభించింది ఈ బ్యూటీ. చిన్న వయసులో అద్భుతంగా నటించి మెప్పించింది.హన్సిక ‘దేశముదురు’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయింది… మొదటి చిత్రంతోనే తన అద్భుతమైన నటనతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. దేశముదురు సినిమాలో ఈ భామ తన క్యూట్ లుక్స్ తో ప్రేక్షకులను ఫిదా చేసింది. ఆ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ భామకు వరుస అవకాశాలు వచ్చాయి.ఈ భామ తెలుగులో వరుసగా స్టార్ హీరోల సినిమాలలో నటించి మెప్పించింది.కెరీర్ పీక్ స్టేజ్ లో వున్న సమయంలోనే ఈ భామ గతేడాది డిసెంబర్ 4న పెళ్లి చేసుకుంది.
తన స్నేహితుడు మరియు వ్యాపారవేత్త అయిన సోహెల్ కతూరియాను ఈ భామ ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరి వివాహం జైపూర్ లోని మండొట ఫోర్ట్ అండ్ ప్యాలెస్ లో ఎంతో గ్రాండ్ గా జరిగింది.పెళ్లి తర్వాత హన్సికా భర్తతో కలిసి మ్యారీడ్ లైఫ్ ను బాగానే ఎంజాయ్ చేస్తోంది. ఈ సందర్భంగా వరుసగా వెకేషన్లకు వెళ్తూ ఎంతో సందడి చేస్తోంది.సోషల్ మీడియాలో వరసగా పోస్టులు పెడుతూ తనకు సంబందించిన అప్డేట్స్ తన అభిమానులకు షేర్ చేస్తుంది.ప్రస్తుతం హన్సిక టర్కీలో ఉంది. ఇస్తాంబుల్ నగర అందాలను ఎంతగానో ఆస్వాదిస్తోంది. ఈ సందర్భంగా ఓ బ్యూటీఫుల్ లోకేషన్ లో ఈ యాపిల్ బ్యూటి స్టన్నింగ్ ఫోజులిచ్చింది. ఆ పిక్స్ ను సోషల్ మీడియాలో తన అభిమానులకు షేర్ చేసింది.ఈ పిక్స్ లో హన్సిక ట్రెండీ లుక్ తో ఆదరగొట్టింది.. జీన్స్ లెహంగా మరియు క్రాప్డ్ షర్ట్ లో సరికొత్త లుక్ లో మెరిసింది.కొంటెగా ఫొజులు ఇస్తూ అట్రాక్ట్ చేసింది. హన్సిక లేటెస్ట్ పిక్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్ చూసి నెటిజన్స్ లైక్స్ మరియు కామెంట్లు తో తెగ వైరల్ చేస్తున్నారు.