తప్పు చేస్తే అగ్రరాజ్యమైనా సరే.. అమెరికాకు భారత HAL మాస్ వార్నింగ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HAL: భారత రక్షణ రంగంలో అత్యంత కీలకమైన ‘తేజస్’ యుద్ధ విమానాల ప్రాజెక్టుకు బ్రేకులు వేస్తున్న అమెరికా కంపెనీకి ఇండియా గట్టి షాక్ ఇచ్చింది. ఇంజిన్ల సరఫరాలో జాప్యం చేస్తూ కాలయాపన చేస్తున్న జీఈ ఏరోస్పేస్ (GE Aerospace) పై భారీ జరిమానా విధించాలని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) సంచలన నిర్ణయం తీసుకుంది. స్వదేశీ యుద్ధ విమానం తేజస్ Mk1A కోసం కావాల్సిన ఇంజిన్ల సరఫరాలో జాప్యం చేసినందుకు ఆ కంపెనీపై భారీ జరిమానాలు (Penalties) విధించాలని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) నిర్ణయించింది. కాంట్రాక్టు నిబంధనల ప్రకారం.. ఆలస్యమైన ప్రతి ఇంజిన్‌కు నష్టపరిహారం వసూలు చేస్తామని తాజాగా HAL సీఎండీ స్పష్టం చేశారు.
Also Read
- Vaibhav Vs Archer: చెప్పినట్లే వైభవ్‌ను బోల్తా కొట్టిస్తున్న ఆర్చర్.. మరోసారి దొరికిపోయిన సూర్యవంశీ..
- IND Vs ENG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమ్‌లో రెండు మార్పులు..
- OTR: కేంద్ర మంత్రి ముందే ప్రశ్నల వర్షం.. బిల్డప్ కోసమేనా..?
- OTR: తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
అసలు ఒప్పందం ఏంటంటే..
భారత వైమానిక దళం (IAF) కోసం తయారు చేస్తున్న తేజస్ Mk1A విమానాల్లో వాడేందుకు 99 F404-IN20 ఇంజిన్ల కోసం జీఈ ఏరోస్పేస్తో గతంలో ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం.. 2024 నుంచి ఏటా 20కి పైగా ఇంజిన్లను డెలివరీ చేయాలి. కానీ ఇప్పటి వరకు కేవలం 6 ఇంజిన్లు మాత్రమే భారత్‌కు అందాయి. ఒప్పందం ప్రకారం ఏటా 20కి పైగా ఇంజిన్లను డెలివరీ చేయాల్సింది పోయి సప్లై చైన్ సమస్యలను జీఈ సాకుగా చూపుతుండటంతో భారత్ దానిని అంగీకరించడం లేదు. ఈ నేపథ్యంలో రెండవ బ్యాచ్ కోసం మరో 113 ఇంజిన్ల కొరకు కుదిరిన 1 బిలియన్ డాలర్ల భారీ ఒప్పందంపై కూడా ఇంజిన్ల సరఫరాలో జాప్యం చేసినందుకు జరిమానా ప్రభావం పడనుందని సమాచారం.
తేజస్ ప్రాజెక్టుపై తీవ్ర ప్రభావం..
ఇంజిన్ల కొరత కారణంగా రక్షణ శాఖ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తేజస్ Mk1A ప్రాజెక్ట్ దాదాపు రెండేళ్లు ఆలస్యమైంది. ఈ ప్రాజెక్ట్ కింద వాయుసేన మొత్తం 180 విమానాల కోసం ఆర్డర్ ఇచ్చింది. అయితే ప్రస్తుతం 18 విమానాలు సిద్ధంగా ఉన్నా, ఇంజిన్లు లేక వాటి అసెంబ్లీ నిలిచిపోయింది. ఐదు విమానాలు త్వరలో ఐఏఎఫ్ ఆమోదం పొందితే డెలివరీకి సిద్ధమవుతాయి. నిజానికి తేజస్ Mk1A పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న విమానం. అయితే ఇంజిన్ల వంటి కీలక భాగాలు సకాలంలో అందకపోవడం వల్ల దేశ రక్షణ సన్నద్ధత దెబ్బతింటోందని HAL ఆందోళన వ్యక్తం చేస్తోంది. విదేశీ కంపెనీల నిర్లక్ష్యాన్ని ఇకపై సహించబోమని, జరిమానాలు విధించడం ద్వారా అగ్రరాజ్య కంపెనీలపై ఒత్తిడి పెంచుతామని భారత్ స్పష్టమైన సందేశం పంపింది.
తాజావార్తలు
-
Vaibhav Vs Archer: చెప్పినట్లే వైభవ్‌ను బోల్తా కొట్టిస్తున్న ఆర్చర్.. మరోసారి దొరికిపోయిన సూర్యవంశీ..
-
Mohan Naik : మాజీ ఇంజనీర్ మోహన్ నాయక్ కేసులో బిగ్ ట్విస్ట్
-
IND Vs ENG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమ్‌లో రెండు మార్పులు..
-
OTR: కేంద్ర మంత్రి ముందే ప్రశ్నల వర్షం.. బిల్డప్ కోసమేనా..?
-
OTR: తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!