Stephen Fleming: రెండు మ్యాచుల్లో 6,7 రన్స్‌కే కుప్పకూలిన సంజూ శామ్సన్.. ఫామ్‌పై సీఎస్‌కే కోచ్ సంచలన వ్యాఖ్యలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stephen Fleming: సంజూ శామ్సన్ టీ20 వరల్డ్ కప్‌లో అద్భుతాలు చేశాడు. ఐపీఎల్‌లో మాత్రం అనుకున్నంత స్థాయిలో మెరుపులు మెరించలేకపోతున్నాడనే విమర్శలు వస్తున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న స్టార్ ప్లేయర్ సంజు శామ్సన్ ఫామ్ అంశం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. మొదటి రెండు మ్యాచ్‌ల్లో అతను కేవలం 6,7 పరుగులకే పరిమితమవ్వడం విమర్శలకు దారితీస్తోంది. ఈ అంశంపై తాజాగా చెన్నై హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పందించారు. “టీ20 క్రికెట్‌లో ప్రతి మ్యాచ్‌లో పరుగులు రాబట్టడం సాధ్యం కాదు. ఇప్పటి వరకు కేవలం రెండు మ్యాచులే జరిగాయి. జస్ట్ రెండు ఇన్నింగ్స్‌ల ఆధారంగా సంజూ ఫామ్‌ను తక్కువ అంచనా వేయలేం. నెట్స్‌లో బాగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. మంచి టచ్‌లో ఉన్నాడు. ఒక్కసారి సంజు కుదురుకుంటే మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించగలడు. కాబట్టి అతని బ్యాటింగ్ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు” అని ఫ్లెమింగ్ క్లారిటీ ఇచ్చేశారు.
READ MORE: Sunny Leone: సన్నీ లియోన్ హాలీవుడ్ ఎంట్రీ.. అమెరికన్ ఓటీటీ సిరీస్ ‘ది జెయింట్’లో కీలక పాత్ర!
Also Read
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
ఇదిలా ఉండగా.. ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంఛైజీల్లో బాగా వినిపించిన పేరు సంజు శామ్సన్. ఈ స్టార్ ప్లేయర్ కోసం రెండు, మూడు ఫ్రాంఛైజీలు పోటీపడ్డాయి. ఆ వరుసలో ఢిల్లీ క్యాపిటల్స్ ముందుంది. సీఎస్‌కే కంటే ముందే ఢిల్లీ ఈ ట్రేడ్‌లో ముందు మొగ్గు చూపడమే కాకుండా దాదాపు దక్కించుకున్నంత పని చేసింది. కానీ, ఆఖరి నిమిషంలో డ్రాప్ అయింది. దీంతో రాజస్థాన్ రాయల్స్‌తో ఏడేళ్లుగా కొనసాగిన సంజూను సీఎస్‌కే సొంతం చేసుకుంది. అయితే.. సంజూ గణాంకాలను పరిశీలిస్తే.. చెన్నైలోని చెపాక్ మైదానం కలిసి రావడం లేదని స్పష్టమవుతోంది. ఐపీఎల్ కెరీర్‌లో ఇక్కడ ఆడిన 6 ఇన్నింగ్స్‌ల్లో అతను కేవలం 66 పరుగులు మాత్రమే చేశాడు. 11 సగటుతో, 100 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేయడం గమనార్హం. ఐపీఎల్ ఆడే అన్ని స్టేడియాల్లోనూ సంజుకు చెపాక్‌లోనే అత్యల్ప రికార్డు ఉంది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 7 పరుగులకే అవుట్ కావడంతో తన హోమ్ గ్రౌండ్ నెగటివ్ రికార్డును కొనసాగించాడు.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!