Healthy Summer Drinks : షుగర్, బీపీ ఉన్నవారికి సైతం బెస్ట్ సమ్మర్ డ్రింక్.. ఈ హెల్తీ డ్రింక్‌ను సింపుల్‌గా ఇలా చేసేయండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Healthy Summer Drinks : ఎండ కాలం వచ్చిందంటే చాలు.. ఫ్రిజ్ లోని చల్లని నీళ్లు, సాఫ్ట్ డ్రింక్స్ వైపు మన మనసు లాగుతుంది. కానీ ఇవి తాత్కాలిక ఉపశమనాన్ని ఇచ్చినా, ఆరోగ్యానికి మాత్రం అంత మంచివి కావని నిపుణులు చెబుతున్నారు. అందుకే మన పెద్దలు చెప్పినట్లుగా సహజసిద్ధమైన డ్రింక్స్ తీసుకోవడం ఉత్తమం. ఎండల తీవ్రత పెరిగే కొద్దీ మన శరీరంలో శక్తి తగ్గిపోయి, నీరసం ఆవహిస్తుంది. ఇలాంటి సమయంలో శరీరానికి తక్షణ శక్తిని ఇస్తూ, వేడిని తగ్గించే అద్భుతమైన డ్రింగ్ ‘సత్తు డ్రింక్’. ఈ ‘సత్తు డ్రింక్’ అనేది ఒక నాచురల్ సమ్మర్ కూలర్ లాంటిది. దీనిని తాగడం వల్ల శరీర వేడి తగ్గడమే కాకుండా, జీర్ణక్రియ మెరుగుపడటంతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా శరీరానికి అందుతాయి. ఆ ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి, దీనిని సింపుల్‌గా ఇంట్లో ఎలా చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Nuzvid: రైస్ పుల్లింగ్ పేరుతో 2.5 కోట్ల ఘరాన మోసం బట్టబయలు..!
Also Read
- Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. 'మునగాకు పొడి'.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
- Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
- Cardiac Arrest: కార్డియాక్ అరెస్ట్ సమయంలో మెదడులో ఏం జరుగుతుంది? ప్రతి సెకను ఎందుకు కీలకం?
- Cancer: వాసనతో కుక్క క్యాన్సర్‌ను గుర్తించగలదా? సైంటిస్టులు ఏం చెబుతున్నారు?
తయారీకి కావాల్సిన పదార్థాలు ఇవే..
ఈ డ్రింక్ చేయడానికి ముందుగా మనం ‘సత్తు ప్రీమిక్స్’ పౌడర్‌ని సిద్ధం చేసుకోవాలి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే..
ఉప్పు శెనగలు (Roasted Gram): 1 కప్పు (పొట్టు తీసినవి)
ఎండుమిరపకాయలు: 2
జీలకర్ర: 1 టీస్పూన్
మిరియాలు: ½ టీస్పూన్
పుదీనా ఆకులు: 2 టేబుల్ స్పూన్లు (దోరగా వేయించినవి)
ఉప్పు & నల్ల ఉప్పు (Black Salt): రుచికి తగినంత
తయారీ విధానం ఇదే..
ముందుగా పొట్టు తీసిన ఉప్పు శెనగలను లో ఫ్లేమ్ మీద కొద్దిగా వెచ్చబడే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే పాన్‌లో ఎండుమిరపకాయలు, జీలకర్ర, మిరియాలు, పుదీనా ఆకులు వేసి క్రిస్పీగా అయ్యే వరకు రోస్ట్ చేయాలి. వేయించిన వీటన్నింటినీ పూర్తిగా చల్లార్చి, మిక్సీ జార్‌లో వేసి మెత్తటి పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పొడిని ఎయిర్ టైట్ జార్‌లో నిల్వ చేసుకుంటే నెల రోజుల పాటు వాడుకోవచ్చు.
సత్తు డ్రింక్ ఇలా చేసేయండి..
ఒక గిన్నెలో లేదా మట్టి కుండలో పావు కప్పు సత్తు పొడిని తీసుకోండి. తర్వాత అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర వేయండి. అనంతరం అర లీటర్ నీళ్లు పోసి ఉండలు లేకుండా బాగా కలపాలి. లాస్ట్‌లో ఒక నిమ్మకాయ రసాన్ని పిండి, కొన్ని ఐస్ క్యూబ్స్ వేసి సర్వ్ చేసుకోవాలి. ఇంతే సింపుల్‌గా మీ ఇంట్లో హెల్తీ సమ్మర్ డ్రింక్‌ను తయారు చేసుకోవచ్చు.
సత్తు డ్రింక్‌తో ఆరోగ్య ప్రయోజనాలు ఏంటంటే..
పని ఒత్తిడిలో ఉన్నప్పుడు లేదా ఎండలో తిరిగినప్పుడు ఇది తాగితే వెంటనే ఎనర్జీ వస్తుంది. అలాగే ఇది నాచురల్ కూలర్ కావడంతో శరీరంలోని వేడిని క్షణాల్లో తగ్గిస్తుంది. ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణ సమస్యలు కూడా తగ్గుతాయి. ఇది తాగిన తర్వాత ఎక్కువ సేపు ఆకలి వేయదు, కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది ఒక మంచి ఎంపికగా చెబుతున్నారు. ఈ వేసవిలో రసాయనాలతో కూడిన డ్రింక్స్ బదులుగా, ఇలా ఇంట్లోనే ‘సత్తు డ్రింక్’ తయారు చేసుకుని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!