Gutha Sukender Reddy: కాళేశ్వరం మీద పెట్టిన శ్రద్దలో 20 శాతం పెట్టినా ఎస్ఎల్బీసీ అయిపోయేది!
- ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం దురదృష్టకరం
- ప్రమాదాన్ని ప్రమాదం లాగ చూడాలి
- నేతలు ఎంత మంది అక్కడికి పోతే అంత డిస్ట్రబ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు మీద పెట్టిన శ్రద్దలో 20 శాతం పెట్టినా.. ఎస్ఎల్బీసీ పూర్తయేది అని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. సొరంగం మార్గంకు టైం పడుతుందని, మొదట్లో లిఫ్ట్ అనుకున్నాం అని తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎస్ఎల్బీసీని వచ్చే మూడేళ్ళలో పూర్తి చేయాలని చూస్తోందన్నారు. ప్రమాదాన్ని ప్రమాదం లాగ చూడాలని.. రాజకీయం చేయొద్దన్నారు. ఇంతకు ముందు పవర్ హౌజ్‌లో ప్రమాదం జరగలేదా?, కాళేశ్వరంలో జనాలు చనిపోలేదా? అని ప్రశ్నించారు. ఎస్ఎల్బీసీ ఎందుకు ఆలస్యం ఎందుకు అయ్యిందనేది కూడా మాజీమంత్రి హరీష్ రావుకి తెలుసు అని గుత్తా చెప్పుకొచ్చారు.
‘ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం దురదృష్టకరం. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుండి నీళ్లు తేవాలనేది ఆలోచన. సొరంగం మార్గం టైం పడుతుందని, మొదట్లో లిఫ్ట్ అనుకున్నాం. కృష్ణా బేసిన్లో వాటర్‌పై నిర్లక్షం జరిగింది. కాళేశ్వరం మీద పెట్టిన శ్రద్దలో 20 శాతం పెట్టినా ఎస్ఎల్బీసీ అయిపోయేది. సీఎం, ఇరిగేషన్ మంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు సమీక్షలు చేసే సమయం ఉండేది కాదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎస్ఎల్బీసీ వచ్చే మూడేళ్ళలో పూర్తి చేయాలని చూస్తుంది. ప్రమాదాన్ని ప్రమాదం లాగ చూడాలి, రాజకీయం చేయొద్దు. ఇంతకు ముందు పవర్ హౌస్ లో ప్రమాదం జరగలేదా?. నువ్వు ఔను అంటే.. నేను కాదు అనడం మంచిది కాదు. హరీష్ రావుకి అన్ని తెలుసు.. ఎందుకు ఆలస్యం ఎందుకు అయ్యింది అనేది కూడా ఆయనకు తెలుసు. ఆత్మపరిశిలన చేసుకుంటే మంచిది. ప్రమాదం జరిగిన గంటలోనే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పాట్లో ఉన్నాడు. నేతలు ఎంత మంది అక్కడికి పోతే.. అంత డిస్ట్రబ్’ అని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.
Also Read
- Sangareddy: భార్య సంపాదన పుట్టింటికి ఇస్తోందని కసి.. సుపారీ ఇచ్చి హత్య చేయించిన భర్త!
- Cockroach Janta Party: మోడీ సర్కార్‌కు బొద్దింకల అల్టిమేటం..
- Trump-Iran: పశ్చిమాసియా రౌడీ చనిపోయాడు.. ఇరాన్‌పై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు
- Sunil Gavaskar: విమర్శించే వారే మళ్లీ బీసీసీఐ దగ్గరకు వస్తారు.. అంతా డబ్బు మహిమ: సునీల్ గావస్కర్
‘పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరుతున్నా. టన్నెల్ కి చాలా షరతులు పెట్టింది అటవీశాఖ. సౌండ్ రాకుండా డ్రిల్ చేయాలని నిబంధన పెట్టారు. హరీష్ రావు విమర్శలు అర్థరహితం. విమర్శలు చేసుకునే సమయమా? ఇది. ఆర్మీ పర్యవేక్షణ ఉంది.. టెక్నికల్ పర్సన్స్ మాట్లాడితే బాగుంటుంది. టన్నెల్ పనులు ఎన్ని అడ్డంకులు వచ్చినా ముందుకు పోవాల్సిందే. ప్రమాదం జరగడం సహజమే, ప్రమాదం పేరు చెప్పి ప్రాజెక్టులు పక్కన పెట్టరు. ఎస్ఎల్బీసీ వదిలేశం అంటే.. నిన్ననే హరీష్ రావు మూడు వేల కోట్లు ఖర్చు చేసినం అని అన్నాడు. ప్రాజెక్టు అనువైనది కాదన్నప్పుడు ఎందుకు మూడు వేల కోట్లు ఖర్చు చేశారు. కాళేశ్వరంకి ఇచ్చిన అడ్వాన్స్ లు ఎస్ఎల్బీసీ ఇస్తే ప్రాజెక్టు పూర్తి అయ్యేది’ అని గుత్తా మండిపడ్డారు.
తాజావార్తలు
-
Kitchen Hacks: వంటింట్లో ఇల్లాళ్లకు బ్రహ్మాస్త్రం.. ఈ చిట్కాలతో గంటల పని నిమిషాల్లో ముగుస్తాయి!
-
Peddi: హోంశాఖకు షాక్: ‘పెద్ది’ టికెట్ల పెంపుపై కోర్టు ధిక్కరణ నోటీసులు!
-
Sangareddy: భార్య సంపాదన పుట్టింటికి ఇస్తోందని కసి.. సుపారీ ఇచ్చి హత్య చేయించిన భర్త!
-
NBK 111 : బాలయ్య ఆన్ ట్రాక్.. ఇక థియేటర్లలో పూనకాలే!
-
Cockroach Janta Party: మోడీ సర్కార్‌కు బొద్దింకల అల్టిమేటం..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!