Peddi: హోంశాఖకు షాక్: ‘పెద్ది’ టికెట్ల పెంపుపై కోర్టు ధిక్కరణ నోటీసులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో వచ్చిన భారీ చిత్రం ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నప్పటికీ, ఈ సినిమా టికెట్ల ధరల పెంపు వ్యవహారం ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. అదనపు ధరలు పెంచుకునేందుకు వీలుగా నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చారంటూ తెలంగాణ హోంశాఖ ముఖ్య కార్యదర్శి శిఖా గోయల్‌పై హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన తెలంగాణ ఉన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే కాక, హోంశాఖ జారీ చేసిన సదరు మెమో పూర్తిగా అక్రమమని తేల్చిచెప్పింది.
‘పెద్ది’ సినిమా విడుదలైన రోజు నుంచి అంటే జూన్ 4 నుంచి దాదాపు 10 రోజుల పాటు థియేటర్లలో టికెట్ ధరలను పెంచుకునేందుకు వీలుగా ఈ నెల 2వ తేదీన హోంశాఖ ఒక ప్రత్యేక మెమో జారీ చేసింది. దీని ప్రకారం సింగిల్ స్క్రీన్లలో రూ. 100, మల్టీప్లెక్స్‌లలో రూ. 125 చొప్పున అదనంగా పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. అయితే, సినిమా టికెట్ల ధరల నియంత్రణకు సంబంధించి గతంలో కోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను, న్యాయస్థాన ఉత్తర్వులను పూర్తిగా ధిక్కరిస్తూ ఈ మెమో జారీ చేశారని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
Also Read
ఈ క్రమంలో కోర్టు విచారణ జరిపి “సినిమా టికెట్ల ధరల సవరణ లేదా పెంపుదల ప్రక్రియ అనేది పూర్తిగా పారదర్శకంగా జరగాలి. ఇలాంటి విషయాల్లో ప్రభుత్వం ఖచ్చితంగా ‘జీవో 121’ (GO 121) లో పొందుపరిచిన నియమ నిబంధనలను మాత్రమే అనుసరించాలి. అలా కాకుండా కోర్టు ఆదేశాలను పక్కనబెట్టి ఇలాంటి మెమోలు జారీ చేయడం చట్టవిరుద్ధం.” స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు గానూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి శిఖా గోయల్‌పై తదుపరి చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. ఈ కేసు తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 15వ తేదీకి వాయిదా వేసింది. అప్పటివరకు ఈ టికెట్ల పెంపు వివాదం ఎలాంటి మలుపులు తిరుగుతుందో, చిత్ర యూనిట్‌పై దీని ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి.
తాజావార్తలు
-
Smart Phone: 6000mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్, 90Hz డిస్ప్లే , 12GB ర్యామ్.. మార్కెట్లోకి కొత్త ఫోన్..
-
Hatha Teaser: కిరణ్ అబ్బవరం బ్యానర్లో కొత్త సినిమా.. ఇంట్రెస్టింగ్గా ‘హతః’ టీజర్! చూశారా
-
BCCI కీలక నిర్ణయాలు.. లైంగిక వేధింపులపై కొత్త కమిటీ, IPL 2027పై ఫోకస్
-
Indonesia: వివాహేతర సంబంధం.. మహిళకు 100 కొరడా దెబ్బలు శిక్ష.. దయ చూపండంటున్నా..
-
Supreme Court: పరీక్షా సంస్కరణలపై సుప్రీంకోర్టు విచారణ.. ఎన్టీఏ ఆఫీస్‌ను సందర్శించే అవకాశం
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..