Site icon NTV Telugu

Gutha Sukender Reddy : నేను అప్పటి నుంచే గవర్నర్ వ్యవస్థకు వ్యతిరేకం

Gutha Sukender

Gutha Sukender

గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వం, శాసన వ్యవస్థ ఒకదానిపై ఒకటి కలిసి పనిచేయాల్సి ఉంటుందని, దీంట్లో ఎవరి విజయం అంటూ ఉండదు అని అన్నారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. తాజాగా ఎన్టీవీ నిర్వహించిన చిట్‌ చాట్‌లో మాట్లాడుతూ.. నేను టీడీపీలో ఉన్నప్పటి నుంచి గవర్నర్ వ్యవస్థకు వ్యతిరేకమని ఆయన వివరించారు. అంతేకాకుండా.. గవర్నర్ ప్రసంగం అంతా సాఫీగా జరగాలని అనుకుంటున్నామన్నారు. ఏపీలో బీఆర్‌ఎస్‌ను ప్రజలు ఆదరిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లా మంత్రి జగదీష్ రెడ్డితో నాకు ఎటువంటి పంచాయితీ లేదని ఆయన స్పష్టం చేశారు. ఎర్రబెల్లి మార్చాలన్న 20 మంది సిట్టింగ్ లలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎంత మంది ఉన్నారో ఆయన్నే అడగండి…నాకేం తెలుసు అని ఆయన వ్యాఖ్యానించారు. గవర్నర్ తన ప్రసంగంలో ఉన్నది ఉన్నట్టు చెబితే చాలని ఆయన ఆయన అన్నారు.

Budget 2023: కేంద్ర బడ్జెట్ ఎలా తయారు చేస్తారో తెలుసా?

ఇదిలా ఉంటే.. నిన్న ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు బాధ్యతతో వ్యవహరించాలని వ్యాఖ్యానించారు. వక్రబుద్ధితో ఆలోచన చేసే వాళ్లకు మంచి బుద్ధి కలగాలన్నారు గుత్తా సుఖేందర్‌ రెడ్డి. జాతిపిత మహాత్మాగాంధీ వర్థంతి సందర్భంగా అసెంబ్లీ ఆవరణలోని ఆయన విగ్రహం వద్ద మండలి చైర్మన్‌, శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సుఖేందర్‌ రెడ్డి మాట్లాడుతూ గాంధీ లేని లోటు కనిపిస్తోందన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజ్యాంగానికి ఆటంకాలు కలుగుతున్నాయని గుత్తా సుఖేందర్‌ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ఉన్న సమాఖ్య. లౌకిక విధానాన్ని కాపాడుకోవాలన్నారు గుత్తా సుఖేందర్‌ రెడ్డి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒకరినొకరు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలని హితవు పలికారు గుత్తా సుఖేందర్‌ రెడ్డి.

Also Read : Minister KTR : బండి సంజయ్‌కి కేటీఆర్‌ సవాల్‌.. మసీదులు కాదు.. దమ్ముంటే కాలువలు తవ్వుదాం రా

Exit mobile version