Crime News: కన్న తండ్రే కాలయముడు.. కూతురును రివాల్వర్‌తో కాల్చిన కసాయి!
- హర్యానాలోని గురుగ్రామ్‌లో దారుణం
- కూతురును రివాల్వర్‌తో కాల్చిన తండ్రి
- రాధికా యాదవ్ హత్య కేసులో ఏం జరిగింది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కూతురి పట్ల కన్న తండ్రే కాలయముడయ్యాడు. నిర్ధాక్షిణ్యంగా తలకు రివాల్వర్ పెట్టి కాల్చి చంపేశాడు. హర్యాణా గురుగ్రామ్‌లో జరిగిన ఈ హత్య దేశవ్యాప్తంగా కలకలం రేపింది. అంతే కాదు కన్నకూతుర్ని చంపానని.. ఏ మాత్రం కనికరం లేకుండా పోలీస్ స్టేషన్‌లో ఒప్పుకున్నాడు ఆ తండ్రి. అసలు టెన్నిస్ ప్లేయర్ రాధికా యాదవ్ హత్య కేసులో ఏం జరిగింది?
హర్యానాలోని గురుగ్రామ్‌లో టెన్నిస్ క్రీడాకారిణి రాధిక యాదవ్ దారుణ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆమెను తండ్రే దారుణంగా రివాల్వర్‌తో కాల్చి చంపేశాడు. రాధిక.. జాతీయ స్థాయిలో టెన్నిస్ క్రీడాకారిణిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఉదయం రాధిక యాదవ్ ఇంట్లో బ్రేక్ ఫాస్ట్ రెడీ చేస్తుండగా.. ఆమె తండ్రి దీపక్ యాదవ్ ఆమెపై 3 రౌండ్లు కాల్పులు జరిపాడు. ఒక బుల్లెట్ ఆమె మెడకు తగలగా.. రెండు బుల్లెట్లు వెనుక భాగంలో తగిలాయి. వెంటనే ఇంట్లోనే ఉన్న మేనమామ ఆమెను ఆస్పత్రికి తరలించాడు. కానీ అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.
Also Read
- Hyderabad: ఫ్రీజర్‌లో పురుగులు, స్టోరేజ్‌లో బల్లులు.. ‘లా పినోజ్ పిజ్జా’ కిచెన్ చూసి షాకైన అధికారులు!
- FIFA Worldcup 2026లో కొత్త చరిత్ర.. ఒక్క రోజులోనే రికార్డు స్థాయి ప్రేక్షకులు.!
- Noam Shazeer: గూగుల్‌కు బిగ్ షాక్.. జెమిని ఏఐ కీలక రూపశిల్పి రాజీనామా.. ఓపెన్ AI గూటికి టెక్ జీనియస్!
- Pakistan: బంగాళాఖాతంపై పాకిస్థాన్ కన్ను.. భారత్‌కు సముద్ర సరిహద్దుల్లో కొత్త సవాల్?
కన్నకూతురుపైనే అత్యంత దారుణంగా రివాల్వర్ ఉపయోగించి బుల్లెట్ల వర్షం కురిపించి చంపేసిన తండ్రి దీపక్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. రాధికా యాదవ్‌ను తానే చంపినట్లు పోలీసుల ఎదుట అంగీకరించాడు దీపక్ యాదవ్. ఆమె టెన్నిస్ అకాడమీ నడపడం ఇష్టం లేకపోవడం వల్లే చంపినట్లు ఒప్పుకున్నాడు. అంతే కాదు.. దీపక్ యాదవ్ పాల కోసం సొంతూరు వజీరాబాద్ వెళ్లినప్పుడల్లా కూతురి సంపాదనతో బతకడానికి సిగ్గు లేదని జనం అంటున్నారు. దీంతో టెన్నిస్ అకాడమీ మూసేయాలని పలుమార్లు కూతురుతో గొడవ పెట్టుకున్నాడు దీపక్. అంతే కాదు సోషల్ మీడియాలో లైమ్ లైట్‌లో ఉండేందుకు నిత్యం రీల్స్ చేసిది రాధికా యాదవ్. కానీ అది తండ్రికి ఇష్టం లేదు. ఈ అలవాటు కూడా మానుకోవాలని పలుమార్లు చెప్పాడు. కానీ రాధిక పట్టించుకోలేదు. ఈ పరిణామాలన్నీ కూతురిపై కోపాన్ని పెంచాయి.
Also Read: Crime News: మూడే రోజులు.. ఇంటి ఓనర్‌ను చంపేసిన పని మనీషి!
ఇప్పటికే కూతురిపై పగతో రగిలిపోతున్న తండ్రి దీపక్‌కు.. కూతురికి సంబంధించి ఒక మ్యూజిక్ వీడియో కూడా నెట్ లో రావడం మరింత ఆజ్యం పోసింది. ఆ వీడియోలో రాధిక ఓ యువకుడికి ప్రియురాలిగా నటించింది. ఆ వీడియోలో కొన్ని రొమాంటిక్ సీన్లు ఉండటంతో కూతురిని తండ్రి మందలించినట్లు తెలుస్తోంది. వీడియోలు చేయొద్దని చెప్పినా వినకపోవడంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
గతంలో దీపక్ ఓల్డ్ గురుగ్రామ్‌లో “డీప్ యాక్సెసరీస్” అనే కార్ల విడిభాగాల షాప్ నడిపించేవాడు. కానీ దానిని తర్వాత మూసివేశాడు. పలు బిల్డింగ్స్ ద్వారా అద్దె ఆదాయం కూడా వస్తోంది. రాధిక టెన్నిస్ కెరీర్ కోసం దీపక్ చాలా కష్టపడ్డాడని స్థానికులు వెల్లడించారు. మొత్తానికి అల్లారుముద్దుగా పెంచుకున్న కన్న కూతురిని దీపక్ చంపడం హాట్ టాపిక్‌గా మారింది.
తాజావార్తలు
-
NEET Re Exam: నీట్ రీ-ఎగ్జామ్‌కు ముందు విషాదం.. 19 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య..
-
Fahadh Faasil : ‘దృశ్యం 3’ నిర్మాతలతో ఫహద్ ఫాసిల్ క్రేజీ డీల్… వరుస ప్రాజెక్టులు
-
Hyderabad: ఫ్రీజర్‌లో పురుగులు, స్టోరేజ్‌లో బల్లులు.. ‘లా పినోజ్ పిజ్జా’ కిచెన్ చూసి షాకైన అధికారులు!
-
FIFA Worldcup 2026లో కొత్త చరిత్ర.. ఒక్క రోజులోనే రికార్డు స్థాయి ప్రేక్షకులు.!
-
Noam Shazeer: గూగుల్‌కు బిగ్ షాక్.. జెమిని ఏఐ కీలక రూపశిల్పి రాజీనామా.. ఓపెన్ AI గూటికి టెక్ జీనియస్!
ట్రెండింగ్
-
Shubman Gill: డబుల్ సెంచరీపై కన్నేశా కానీ.. టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kitchen Tips : చపాతీ ఎక్కువ సేపు మెత్తగా ఉండాలంటే.. పిండి కలిపేటప్పుడు ఈ చిట్కాలను పాటించండి.!
-
Chicken Bones : చికెన్ తిన్నాక ఎముకలను పారేస్తున్నారా.? వాటితో ఎన్నో ప్రయోజనాలు.!
-
Hair Care Tips : జుట్టు త్వరగా జిడ్డుగా మారుతోందా? ఈ సింపుల్ టిప్స్‌తో రోజంతా ఫ్రెష్‌గా!
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!