Namrata Shirodkar: మహేశ్.. అభిమానులకు మీరొక ఎమోషన్! నమ్రత పోస్ట్ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన తాజా సినిమా ‘గుంటూరు కారం’. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత వీరిద్దరి కాంబోలో సినిమా వస్తుండడంతో.. అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, ట్రైలర్ యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తున్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గుంటూరు కారం సందడి చేయనుంది. ఈ సందర్భంగా గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మేకర్స్ మంగళవారం గుంటూరులో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈవెంట్‌లో మహేశ్ బాబు అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు.
‘మీ అభిమానం ప్రతీ ఏడాది పెరుగుతూనే ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మాటల్లేవ్.. ఏం చెప్పాలో నాకు తెలియదు. ఎప్పుడూ చెబుతూ ఉంటాను కదా.. చేతులెత్తి దండం పెట్టడం తప్ప ఏమి తెలియదు. మీరు ఎప్పుడూ నా గుండెల్లో ఉంటారు. సంక్రాంతి నాకు, నాన్న గారికి బాగా కలిసొచ్చిన పండగ. సంక్రాంతికి మా సినిమా రిలీజ్ అయ్యితే బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంటుంది. ఈసారి కూడా అదే రిపీట్ అవుతుంది. ఐతే ఇప్పుడు నాన్న లేరు. ఆయన నా సినిమాలు చూసి రికార్డులు, కలెక్షన్ల గురించి చెబుతుంటే.. ఆనంద పడేవాడిని. అంతకంటే ఆనందం ఏముంటుంది. ఇప్పుడు ఆ సంగతులన్నీ మీరే చెప్పాలి. ఇక నుంచి మీరే నాకు అమ్మ, నాన్న’ అని మహేశ్ బాబు అన్నారు.
Also Read
- CM Revanth Reddy : దేశానికే మోడల్‌గా కొడంగల్.. రూ. 110 కోట్లతో శ్రీవారి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ
- CM Chandrababu: కాగితాలు తీసుకుని కార్లో వదిలిపెట్టొద్దు, పరిష్కారం చూపండి.. కలెక్టర్లకు సీఎం ఆదేశాలు!
- Shakti Kapoor: తన మరణ వార్తలపై.. కౌంటర్ ఇచ్చిన శక్తి కపూర్
- CM Chandrababu: మంత్రుల రివ్యూకు మినహాయింపు ఉండదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్!
Also Read: Mohammed Shami: దేశం కోసం నిరంతరం శ్రమిస్తా.. షమీ భావోద్వేగ పోస్టు!
ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మహేష్ బాబు మాట్లాడిన వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేసిన నమ్రత.. అభిమానులకు ధన్యవాదాలు చెప్పారు. ‘మహేష్ అభిమానుల గురించి ఇప్పటికే ఎంతోమంది గొప్పగా చెప్పారు. ఈ విషయం గురించి మాట్లాడే చివరి వ్యక్తిని బహుశా నేనే కావచ్చు. మన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఆయనపై అపారమైన ప్రేమను కురిపిస్తారు. ప్రతి ప్రయత్నంలో అండగా నిలిచి, మరింత కష్టపడి పని చేసేలా చేస్తున్నారు. ఈరోజు మా సొంత ఊరు గుంటూరులో ఆయనకు, గుంటూరు కారం టీమ్‌కు లభించిన ఆదరణ చూసి ఓ విషయం చెప్పాలి. మహేశ్.. అభిమానులకు మీరొక ఎమోషన్. ఈ ప్రేమను మనం జీవించి ఉన్నంత కాలం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నా. మహేష్ బాబుని ఎంతో ప్రేమగా ప్రేమిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు’ అని నమ్రత పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Suryakumar-Gill: భారత జట్టులో కీలక మార్పులు.. గిల్, సూర్యకు షాక్ తప్పదా?
-
Dragon – Peddi : ఎన్టీఆర్ – రామ్ చరణ్ మరోసారి.. ఫ్యాన్స్ కు పూనకాలే
-
Easy Evening Snacks : టీ టైమ్ స్నాక్.. కేవలం రవ్వతో కరకరలాడే స్నాక్స్.. ఒక్కసారి చేస్తే వారం రోజులు నిల్వ.!
-
Rajinikanth : ఆ ‘100వ సినిమా’ తీయకుండానే వెళ్ళిపోయారు.. ఆర్‌బీ చౌదరి పై రజనీకాంత్ ఎమోషనల్..
-
CM Revanth Reddy : దేశానికే మోడల్‌గా కొడంగల్.. రూ. 110 కోట్లతో శ్రీవారి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ