టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం..మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12 న థియేటర్లలో రిలీజ్ అయింది అది కూడా కేవలం తెలుగులో మాత్రమే రిలీజ్ అయిన ఈ మూవీ.. ఫిబ్రవరి 9వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ మరియు మలయాళం వంటి డబ్బింగ్ వెర్షన్‍లోనూ అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో రిలీజైన నెలలోపే ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‍కు వచ్చింది. దీంతో ఓటీటీలోనూ ఈ చిత్రం దుమ్మురేపుతోంది. అయితే, తెలుగులో అంతా బాగానే ఉన్నా కానీ డబ్బింగ్ వెర్షన్ విషయంలో ఈ మూవీపై నిరాశ వ్యక్తమవుతోంది.గుంటూరు కారం సినిమా కన్నడ వెర్షన్‍పై అసంతృప్తి వ్యక్తమవుతోంది.
ట్రాన్స్‌లేషన్‍తో పాటు వాయిస్‍లు కూడా అంతగా సూటవ్వలేదని చాలా మంది కన్నడ ప్రేక్షకులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కన్నడ డబ్బింగ్ చాలా నాసిరకంగా ఉందని నిరాశ చెందుతున్నారు. డబ్బింగ్‍ను హడావుడిగా కానిచ్చేశారని అభిప్రాయపడుతున్నారు. అలాగే గుంటూరు కారం తమిళ డబ్బింగ్ విషయంలోనూ కొందరు నెటిజన్లు పెదవి విరుస్తున్నారు.గుంటూరు కారం చిత్రంలో మాస్ సాంగ్ ‘కుర్చీ మడత పెట్టి’ ఓ ఊపు ఊపేసింది. ఈ చిత్రం లో ఆ సాంగ్ ఫుల్ పాపులర్ అయింది. అయితే, డబ్బింగ్ వెర్షన్‍లలో ఈ సాంగ్ పేలవంగా ఉందని కొందరు విమర్శిస్తున్నారు. అన్ని భాషల ఆడియోలో ఒరిజినల్ సాంగ్ ఉంచేసి ఉంటే బాగుండేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. ‘కుర్చి మడతపెట్టి’ పాట వివిధ భాషల వీడియోలను కలిపి వీడియోలను పోస్ట్ చేస్తున్నారు.ఇదిలా ఉంటే మరోవైపు గుంటూరు కారం తెలుగు వెర్షన్ నెట్‍ఫ్లిక్స్‌లో దూసుకెళుతోంది. మంచి వ్యూవర్‌షిప్ దక్కించుకుంటోంది. సినిమాలోని హైలైట్‍లను అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.