సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గుంటూరు కారం’.. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, మహేశ్ బాబు కాంబినేషన్లో ఈ మూవీ తెరకెక్కుతుండటంతో సినిమా పై భారీ హైప్ ఏర్పడింది.వీరి కాంబోలో ఇప్పటికే రెండు సినిమాలే రాగా తాజాగా గుంటూరు కారం మూవీ మూడో సినిమాగా తెరకెక్కింది. వీరిద్దరి కాంబోలో సినిమా తెరకెక్కుతుంది అని తెలియగానే ఏ వివరాలు తెలియకపోయినా.. మూవీపై అంచనాలు పెంచేసుకున్నారు అభిమానులు. అప్పటినుంచి వారి అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా విడుదలయిన ప్రతీ పోస్టర్లో మహేష్ ను మాస్ లుక్ లో చూపించాడు త్రివిక్రమ్. కానీ మొదటిసారి క్రిస్మస్ స్పెషల్ పోస్టర్లో మాస్ కాకుండా క్లాస్ మహేశ్ బాబును చూపించాడు.‘గుంటూరు కారం’ అనే టైటిల్లోనే చాలా మాస్ ఉంది. దానికి తగినట్టుగా.. ఈ సినిమాలో నుండి మహేష్ ఫస్ట్ లుక్ ను రెడ్ షర్ట్, బీడీతో రిలీజ్ చేశాడు. ‘ఒక్కడు’ తర్వాత మహేశ్ బాబు సిగరెట్, బీడీ తాగుతూ ఎప్పుడూ కనిపించలేదని ఫ్యాన్స్ గుర్తుచేసుకున్నారు. కేవలం ఆ పోస్టర్లోనే కాదు.. అప్పటినుండి విడుదలవుతున్న ప్రతీ పోస్టర్లో కూడా మహేష్ బీడీతోనే కనిపించాడు. కానీ క్రిస్మస్ పోస్టర్లో మహేశ్ చేతిలో బీడీ లేదు. బ్లాక్ షర్ట్లో క్లాస్ లుక్ తో,సింపుల్ స్మైల్ తో చాలా కూల్ గా కనిపించాడు.
మహేష్ లేడీ ఫ్యాన్స్ అయితే ఈ పోస్టర్ ని చూసి ‘ఓ మై బేబీ’ అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు.. ఇదిలా ఉంటే ఇప్పటికే ‘గుంటూరు కారం’ సినిమా నుండి రెండు పాటలు విడుదలయ్యాయి. ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుండి మొదటి ‘దమ్ మసాలా’ పాట విడుదలయ్యింది. మహేశ్ మాస్ కటౌట్ కీ సరిపోయేలా ఉన్న ఈ పాట వెంటనే మ్యూజిక్ లవర్స్ ని ఎంతగానో ఇంప్రెస్ చేసేసింది. ఆ తర్వాత ఒక క్యూట్ పాటను రిలీజ్ చేసింది మూవీ టీమ్. ఇది మూవీలో హీరోయిన్గా నటిస్తున్న శ్రీలీల.. మహేశ్ కోసం పాడే పాట. ‘ఓ మై బేబీ’ అంటూ సాగే ఈ పాటకు ముందుగా ఆడియన్స్ నుండి అంత పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. కానీ మెల్లగా ఇది మ్యూజిక్ లవర్స్ ని ఆకట్టుకోవడం మొదలుపెట్టింది. దీంతో ‘ఓ మై బేబీ’ పాటకు యూట్యూబ్లో మిలియన్లకొద్దీ వ్యూస్ వచ్చేస్తున్నాయి.గుంటూరు కారం మూవీ 2024 జనవరి 12న విడుదల కానుందని తాజాగా రిలీజ్ చేసిన క్రిస్మస్ స్పెషల్ పోస్టర్ తో మరోసారి క్లారిటీ మేకర్స్ ఇచ్చారు.