సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారం.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. మహేష్ బాబు 28 వ సినిమా గా వస్తున్న ఈ చిత్రం లో యంగ్ బ్యూటీ శ్రీలీల మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది.అలాగే ఈ సినిమా లో మీనాక్షి చౌదరి మరో హీరోయిన్ గా నటిస్తోంది కాగా ఇటీవలే గుంటూరు కారం నుంచి ధమ్ మసాలా లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేయగా.. అభిమానులకు విజువల్ ఫీస్ట్ ఫీల్ అందిస్తూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది.తాజాగా గుంటూరు కారం మూవీ సెకండ్ సింగిల్ రిలీజ్ పై అప్‌డేట్ అందించారు నిర్మాత నాగవంశీ. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెషన్‌లో థ్రిల్లింగ్ అప్‌డేట్ ను అందించారు.
వచ్చే వారం గుంటూరు కారం మూవీ నుంచి రెండో పాట ను లాంఛ్ చేస్తున్నట్టు ప్రకటించాడు. అంతేకాదు ఈ చిత్రం లో మొత్తం 4 పాటలుండబోతున్నాయని ఆయన క్లారిటీ ఇచ్చాడు.. ఈ చిత్రాన్ని హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్ రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు.స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు.గుంటూరు కారం సినిమా 2024 జనవరి 12 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్ల లో గ్రాండ్ గా విడుదల కానుంది. ఇప్పటికే లాంఛ్ చేసిన గుంటూరు కారం మాస్ స్ట్రైక్ కు మహేశ్ బాబు అభిమానులు నుంచి అదరిపోయే రెస్పాన్స్ వచ్చింది. వారు ఆశిస్తున్న ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ మూవీ తో అందించబోతున్నట్టు చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చేసింది. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత మహేశ్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబో లో వస్తున్న సినిమా కావడం తో సినిమా పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇటీవలే మహేశ్‌బాబు, శ్రీలీల, రమ్యకృష్ణ మరియు జగపతిబాబు పై వచ్చే కీలక సన్నివేశాలు చిత్రికరించినట్లు సమాచారం.