మహేష్ బాబు,త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం.. సంక్రాంతి కానుకగా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఈ సినిమా ఒకవైపు పాజిటివ్ టాక్ ను అందుకున్నా కూడా మరోవైపు కలెక్షన్స్ భారీగా తగ్గినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కానీ, రెస్పాన్స్ మాత్రం భారీగానే లభిస్తోంది. ఈ నేపథ్యంలో మహేశ్ బాబు నటించిన ‘గుంటూరు కారం’ 3 రోజుల వసూళ్లను ఇప్పుడు చూద్దాం..
ఈ సినిమా మహేష్ బాబు హీరోగా నటించగా.. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా చేశారు. అలాగే, ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం, రమ్యకృష్ణలు కీలక పాత్రలను పోషించారు. ఈ మూవీని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మించారు. థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూర్చాడు…
ఈ సినిమాకు నైజాంలో రూ. 42 కోట్లు, సీడెడ్‌లో రూ. 13.75 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాలు అన్నీ కలిపి రూ. 46.25 కోట్ల బిజినెస్ అయింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 102 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 9 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 20 కోట్లతో కలిపి మొత్తంగా రూ. 132 కోట్లు బిజినెస్ అయింది.. ఇక మూడో రోజు కలెక్షన్స్ ను చూస్తే.. ప్రేక్షకుల నుంచి స్పందన ఆశించిన స్థాయిలో రాలేదు. ఫలితంగా ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 8 కోట్లు షేర్ వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 11 కోట్లు వరకూ రాబట్టింది..మొత్తంగా చూసుకుంటే ఓవరాల్ గా 16.4 కోట్లను రాబట్టినట్లు మేకర్స్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.. ఇకపోతే ఏ ఏరియాలో ఎంత వసూల్ చేసిందనే విషయం తెలియాల్సి ఉంది.. హనుమాన్ సినిమా ఎఫెక్ట్ తోనే కలెక్షన్స్ తగ్గినట్లు ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు..