Sangareddy: గన్ మిస్ ఫైర్.. సీఐఎస్ఎఫ్ జవాన్ దుర్మరణం
- గన్ మిస్ ఫైర్ అయి సీఐఎస్ఎఫ్ జవాన్ దుర్మరణం
- సంగారెడ్డి జిల్లా బీడీఎల్ బానూరు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న జవాన్ వెంకటేశ్వర్లు
- సీఐఎస్ఎఫ్ వాహనంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపిన పోలీసు అధికారులు
- మృతుడు స్వస్థలం నంద్యాల జిల్లా అవుకు మండలం జూనూతల.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంగారెడ్డి జిల్లా బీడీఎల్ బానూరు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సిఐఎస్ఎఫ్ జవాన్ వెంకటేశ్వర్లు గన్ మిస్ ఫైర్ అయ్యి దుర్మరణం చెందాడు. రాత్రి విధులకు వెళ్లి ఉదయం తిరిగి వస్తుండగా సీఐఎస్ఎఫ్ వాహనంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న బీడీఎల్ బానూరు పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు నంద్యాల జిల్లా అవుకు మండలం జూనూతలకు చెందినవాసిగా తెలిపారు. గతంలో ప్రధాని మోడీ భద్రత టీమ్‌లో 2 ఏళ్లు విధులు నిర్వహించాడు. కాగా.. మృతదేహాన్ని స్వస్థలం అవుకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Citroen Basalt: టాటా కర్వ్ ప్రత్యర్థిగా రాబోతున్న సిట్రొయన్ బస్టాల్..
Also Read
వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని నంద్యాల జిల్లా జూనూతుల గ్రామానికి చెందిన ఆర్మీ జవాను వెంకటేష్(34) సీఐఎస్ఎఫ్లో విధులు నిర్వహిస్తున్నాడు. హైదరాబాదులోని సిఐఎస్ఎఫ్ బెటాలియన్‌లో విధులు నిర్వర్తిస్తుండేవాడు. విధుల్లో ఉండగా తమ బెటాలియన్‌కు చెందిన బస్సులో తన వద్ద ఉండే తుపాకీ పేలినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తన వద్ద ఉండే గన్ పేలడంతో తలలోకి బుల్లెట్లు చొచ్చుకుపోవడంతో జవాను అక్కడికక్కడే బస్సులోనే రక్తపు మడుగుల్లో కుప్ప కూలిపోయాడు. బస్సులో వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. మృతి చెందిన జవాన్ 13 సంవత్సరాల క్రితం ఉద్యోగంలో చేరాడు. మృతుడికి ఒక కూతురు, కుమార్తె ఉన్నారు. తండ్రి పెట్నికోట వడ్డే వెంకటస్వామి, తల్లి కూలీ పనులు చేస్తూ జూనూతల గ్రామంలోని నివసిస్తున్నారు. ఉద్యోగంలో ఉన్న కొడుకు మరణించడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.
AAP: హర్యానాలో ఆప్ హామీల వర్షం.. ఢిల్లీ-పంజాబ్ మాదిరిగా వ్యూహాలు..
- Tags
- cisf jawan
- died
- gun
- misfired
- sangareddy
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు