హైదరాబాద్ నగరంలోని మింట్ కాంపౌండ్ లో ఇవాళ (గురువారం) తుపాకీ మిస్ ఫైర్ కావడంతో కానిస్టేబుల్ రామయ్య మృతి చెందాడు. మింట్ కాంపౌండ్ లోని ప్రింటింగ్ ప్రెస్ లో సెక్యూరిటీగా ఉన్న రామయ్య.. తుఫాకిని శుభ్రం చేస్తుండగా మిస్ ఫైర్ అయినట్లుగా అధికారులు తెలిపారు. తీవ్ర గాయాలైన రామయ్యను ఆసుపత్రికి అధికారులు తరలించారు. గన్ మిస్ పైర్ కావడంతో కానిస్టేబుల్ రామయ్య అక్కడికక్కడే మృతి చెందాడు.
Read Also: Best Mileage Bike 2023: స్టైల్‌లోనే కాదు మైలేజ్‌లోనూ కింగే.. ఈ బైక్ ధర కేవలం 54 వేలు మాత్రమే!
హైదరాబాద్ సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని.. మింట్ కాంపౌండ్ లో రామయ్య హెడ్ కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్నాడు. ఉదయం SLR గన్ మిస్ ఫైర్ అయి.. ఛాతి లోకి బులెట్ దూసుకెళ్లింది. దీంతో అక్కడికక్కడే హెడ్ కానిస్టేబుల్ రామయ్య కుప్పకూలాడు. వెంటనే హుటాహుటిన నాంపల్లి కేర్ హాస్పిటల్ కి అధికారులు తరలించారు. హాస్పిటల్ కి తరలించే లోపే హెడ్ కానిస్టేబుల్ రామయ్య మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. అయితే.. ప్రస్తుతం నాంపల్లి కేర్ ఆస్పత్రిలో రామయ్య మృతదేహాం ఉందని అధికారులు చెప్పారు. ఇక కానిస్టేబుల్ రామయ్యది మంచిర్యాల అని అధికారులు వెల్లడించారు.
Read Also: Andhra Pradesh: అమ్మపై అధికారులకు బాలిక ఫిర్యాదు.. చదువంటే ప్రాణం మరి..!