Gummanuru Jayaram: వైసీపీకి, మంత్రి పదవికి మంత్రి గుమ్మనూరు జయరాం రాజీనామా చేశారు. తాను వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన స్వయంగా ప్రకటించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇవాళ చంద్రబాబు సమక్షంలో టీడీపీ చేరుతున్నానని తెలిపారు. మంత్రి పదవి, వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని వెల్లడించారు. కర్నూల్ ఎంపీగా పోటీ చేయాలని జగన్ అడిగారని.. తనకు ఇష్టం లేదన్నారు. టీడీపీ తరఫున గుంతకల్లు నుంచి పోటీ చేస్తున్నానని గుమ్మనూరు జయరాం స్పష్టం చేశారు.
Read Also: Machani Somnath: మా మద్దతు మాచాని సోమనాథ్‌కే.. ఎమ్మిగనూరు టికెట్ కేటాయించాలి..
12 ఏళ్ల నుంచి వైసీపీ జెండా మోశానని.. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నాను.. మంత్రి పదవి చేశాను.. ఆలూరు ప్రజల మనోభావాలకు అనుగుణంగా వైసీపీని వీడుతున్నానని ఆయన వెల్లడించారు. చంద్రబాబు సమక్షంలో జయహో బీసీ సదస్సులో టీడీపీలో చేరుతున్నానన్నారు. ఆలూరు నియోజకవర్గంలోనే ఉండాలని కోరుకున్నా.. ఎంపీ పదవి వద్దన్నానని ఆయన తెలిపారు.మా నియోజకవర్గం ప్రజలు కూడా ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నారన్నారు. మా కులం ఎక్కువగా రెండు జిల్లాల్లో ఉన్నారు.. గుంతకల్ నుంచి పోటీ చేయడానికి తాను సుముఖంగా ఉన్నానన్నారు. సొంతూరు గుంతకల్ దగ్గర్లోనే ఉంది.. కాబట్టి తాను గుంతకల్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నానని తెలిపారు.
Read Also: Heat Waves: ఈ ఏడు సుర్రు సమ్మరే.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు!
గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ..”కర్ణాటకలో నా సోదరుడు మంత్రిగా ఉన్నారంతే.. నేనేమీ కాంగ్రెస్ పార్టీతో టచ్ లో లేను. సీఎం జగన్ నా.. నా.. అంటున్నారు.. కానీ ఉమ్మడి కర్నూలు జిల్లాలో బీసీలకు న్యాయం జరగలేదు. ఓ బోయను.. ఓ ఎస్సీ.. ఓ ముస్లింలను తీసేశారు. 2022 తర్వాత జగన్ను ఓ దేవుడిగానే చూశాను. 2022 తర్వాత జగన్ విగ్రహంగా మారారు. ఆ విగ్రహానికి సజ్జల, ధనుంజయ్ రెడ్డిలు పూజారులు. పూజారులు వాళ్ల కొడుకులకే న్యాయం చేస్తున్నారు కానీ.. భక్తులకు న్యాయం చేయడం లేదు.” అని గుమ్మనూరు జయరాం అన్నారు.