Site icon NTV Telugu

Rashid Khan : నేనే నెంబర్ వన్..

Rasheed Khan

Rasheed Khan

మరో రెండు రోజుల్లో ప్రారంభంకానున్న ఐపీఎల్ లీగ్ 16వ సీజన్ కోసం అంతా సిద్దమైపోయింది. అయితే గత సీజన్ లో ఛాంపియన్ గా నిలిచిన గుజరాత్ టైటాన్స్ కు.. ఈ సీజన్ ప్రారంభానికి ముందు అదిరిపోయే వార్త అందింది. తాజాగా టీ20 అంతర్జాతీయ బౌలింగ్ ర్యాంకింగ్ లో ఆ జట్టు స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ అగ్రస్థానాని కైవసం చేసుకున్నాడు. రీసెంట్ గా పాకిస్తాన్ తో జరిగిన టీ20 సిరీస్ లో ఆకట్టుకునే ప్రదర్శన చేసిన ఈ మార్క్ ను అందుకున్నాడు.

Also Read : Vemula Prashant Reddy : మళ్ళీ టోల్ టాక్స్ రేట్లు గనుక పెంచితే “మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్లు”

లంక మిస్టరీ స్పిన్నర్ వనిందు హసరంగాను అధిగమించి తొలి ర్యాంకును రషీద్ ఖాన్ సాధించాడు. మెగా టోర్నీ 2023కి రెండు రోజుల ముందు అతడు ఈ ఘనత సాధిచండం విశేషం. దీంతో అతడు ఈ సీజన్ లో తన బంతితో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో అని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. కాగా. గతంలోనూ 2018లో టీ20 ఫార్మాట్లో రషీద్ ఖాన్ తొలిసారి నెంబర్ వన్ బౌలర్ గా నిలిచాడు. గత సీజన్ లో గుజరాత్ టైటాన్స్ ట్రోఫీని ముద్దాడడంలో కీలకంగా వ్యవహరించాడు. అప్పుడు మొత్తంగా 16 మ్యాచ్ లు ఆడిన అతడు 19 వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా గ్రాండ్ లీగ్ లో అతడు ఇప్పటి వరకూ మొత్తం 92 మ్యాచ్ లు ఆడి.. 6.38 ఎకానమీతో 112 వికెట్లు తీశాడు.

Also Read : BJYM : బీజేవైఎం నాయకులు బెయిల్‌పై విడుదల

కాగా, షార్జా వేదికగా పాకిస్తాన్ తో జరిగిన టీ20 సిరీస్ లో రషీద్ ఖాన్ ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. చాలా పొదుపుగా బౌలింగ్ చేశాడు. మొత్తం మూడు మ్యాచ్ ల ఈ సిరీస్ లో తొలి మ్యాచ్ లో ఒక వికెట్ తీసిన అతడు.. రెండో టీ20లోనూ ఓ వికెట్ తీశాడు. ఇక చివరి టీ20లోనూ ఓ వికెట్ పడగొట్టాడు. అలా ఈ ప్రదర్శనతో తాజా టీ20 ర్యాంకింగ్స్ లో 710 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. అఫ్ఘానిస్తా్న్ కు చెందిన మరో ప్లేయర్ పేసర్ ఫజల్ మక్ ఫారూకీ.. మూడో ర్యాంకుకు చేరుకున్నాడు. అతడు పాక్ తో జరిగిన సిరీస్ లో 5 వికెట్లు తీసి టాప్ -5లోకి దూసుకొచ్చాడు. ఇతడు ఐపీఉల్ తాజా సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతున్నాడు. ఇతని ప్రదర్శనతో కూడా సన్ రైజర్స్ కు మంచి బూస్టప్ వచ్చినట్టైంది. ఇక ఆఫ్ఘాన్ కు చెందిన మిస్టరీ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్ కూడా ఎనిమిదో స్థానంలో నిలిచాడు.

Also Read : Off The Record:అక్కడ బీఆర్ఎస్ వర్సెస్ కామ్రేడ్స్

మొత్తంగా తాజా ర్యాంకింగ్స్ లో రషీద్ ఖాన్ ( అఫ్ఘానిస్తాన్-710 పాయింట్లు), వనిందు హసరంగ( శ్రీలంక-695 పాయింట్లు), ఫజల్ హక్ ఫారూకీ( అఫ్ఘానిస్తాన్-692పాయింట్లు), జోష్ హాజిల్ వుడ్( ఆస్ట్రేలియా-690 పాయింట్లు), ఆదిల్ రషీద్ ( ఇంగ్లాండ్-684 పాయింట్లు) తొలి ఐదు స్థానాల్లో నిలిచారు. స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ రీసెంట్ గా ఓ అరుదైన రికార్డు కూడా సాధించాడు. టీ20 ఫార్మాట్ లో 500 వికెట్లు మార్క్ అందుకున్నాడు. దక్షిణాఫ్రికా టీ20 లీగ్ లో ప్రిటోరియా క్యాపిటల్స్-ముంబయ్ కేప్ టౌన్ మధ్య జరిగిన మ్యాచ్ లో తన 500వ వికెట్ ను రషీద్ ఖాన్ తీశాడు.

Exit mobile version