Congress: కాంగ్రెస్‌కు మరో షాక్.. కీలక నేత గుడ్‌బై
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు వరుస దెబ్బలు తగులుతున్నాయి. మరికొద్ది రోజుల్లోనే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. కానీ ఇంతలోనే ఆ పార్టీ ముఖ్య నేతలు పార్టీని వీడడం కలవరపెడుతోంది.
ఇప్పటికే మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్‌చవాన్, మాజీ ప్రధాని లాల్ బహుదర్ శాస్త్రి మనవడు విభాకర్ శాస్త్రితో సహా పలువురు నేతలు హస్తానికి గుడ్‌బై చెప్పారు. తాజాగా అదే కోవలోకి మరొక కీలక నేత వచ్చి చేరారు.
Also Read
- El Nino: ఎల్‌నినోతో వర్షాలుండవన్నారు.. ఇప్పుడెందుకు భారత్‌ను ముంచెత్తున్నాయి.. కారణమేంటి?
- TMC: సొంత డబ్బులతో విమానం కొని, దానికే అద్దె చెల్లించారు.. తృణమూల్ స్కాంతో ఈడీ షాక్..
- Greece: గ్రీస్‌లో ప్రమాదం.. ల్యాండింగ్ అవుతుండగా దగ్ధమైన యుద్ధ విమానం
- TMC Crisis: మమతా బెనర్జీకి షాక్.. బీజేపీలోకి మాజీ టీఎంసీ ఎంపీలు..
గుజరాత్ కాంగ్రెస్ సీనియర్ నేత అర్జున్ మోద్వాడియా (Arjun Modhwadia) ఆ పార్టీకి రాజీనామా చేశారు. అంతేకాకుండా తన ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేస్తూ గుజరాత్ అసెంబ్లీ స్పీకర్‌కు రాజీనామా లేఖను అందచేశారు. పార్టీ నుంచి వైదొలగుతున్నానని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు ఆయన లేఖ పంపారు. దీంతో నాలుగు దశాబ్దాల పాటు కాంగ్రెస్‌తో ఉన్న బంధం తెగిపోయింది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో మోద్వాదియా పోర్‌బందర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

లేఖలో ఏముందంటే..
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తూ ఖర్గేకు లేఖ పంపించారు. అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి కాంగ్రెస్ హాజరుకాకపోవడం బాధ కల్గించిందని తెలిపారు. ఆహ్వానాన్ని తిరస్కరించడం దేశ ప్రజల మనోభావాలు దెబ్బతీశాయని చెప్పుకొచ్చారు. ప్రజల మనోభావాలను అంచనా వేయడంలో కాంగ్రెస్ విఫలమైందని ఆరోపించారు. ఈ పవిత్ర సందర్భం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు రాహుల్‌గాంధీ అసోంలో రచ్చ సృష్టించేందుకు ప్రయత్నించారని విమర్శించారు. ఇది భారత పౌరులను, కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలను మరింత దెబ్బతీశాయని లేఖలో మోద్వాడియా పేర్కొన్నారు.
Gujarat Congress leader Arjun Modhwadia resigns from the Congress party.
His letter to party chief Mallikarjun Kharge reads, "…Prabhu Ram is not just Pujaniya to Hindus, but he is the Aastha of Bharat. Declining the invitation to witness pran pratishtha mahotsav has hurt the… pic.twitter.com/jHCpn6nOD1
— ANI (@ANI) March 4, 2024
తాజావార్తలు
-
Ponnam Prabhakar : వర్షాకాలం.. బస్తీ దవాఖానలపై ప్రభుత్వం అలర్ట్
-
El Nino: ఎల్‌నినోతో వర్షాలుండవన్నారు.. ఇప్పుడెందుకు భారత్‌ను ముంచెత్తున్నాయి.. కారణమేంటి?
-
TMC: సొంత డబ్బులతో విమానం కొని, దానికే అద్దె చెల్లించారు.. తృణమూల్ స్కాంతో ఈడీ షాక్..
-
Viral Video : “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటా”.. మనవడితో సీఎం రేవంత్ రెడ్డి మధుర క్షణాలు
-
Greece: గ్రీస్‌లో ప్రమాదం.. ల్యాండింగ్ అవుతుండగా దగ్ధమైన యుద్ధ విమానం
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!