NTV Telugu Site icon

Kodali Nani: టీడీపీ హయాంలో ఏం చేశారో చెప్పాలి.. కొడాలి నాని డిమాండ్.

Kodali Nani On Cbn

Kodali Nani On Cbn

Kodali Nani: కృష్ణాజిల్లా గుడివాడలోని 15వ వార్డులో రూ. 3కోట్ల 28లక్షల నిధులతో నిర్మించిన వాటర్ ట్యాంక్‌ను ఎమ్మెల్యే కొడాలి నాని, కృష్ణా జిల్లా పరిషత్ ఛైర్మన్ ఉప్పాల హారికతో కలిసి ఎంపీ వల్లభనేని బాలశౌరి ప్రారంభించారు. 4ఏళ్ల 8నెలల వైసీపీ పాలనలో 98శాతం మ్యానిఫెస్టో హామీల అమలు.. పేదల పక్షాపాతి సీఎం జగన్ అంటూ ఎంపీ వల్లభనేని బాలశౌరి వ్యాఖ్యానించారు. సామాన్య ప్రజల ప్రాథమిక అవసరాలు తీర్చడమే సీఎం జగన్ ప్రభుత్వ ప్రాధాన్యత అంటూ ఆయన తెలిపారు. 2వందల కోట్ల జల్ జీవన్ మిషన్ నిధులతో గుడివాడలో త్రాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టామన్నారు.

Also Read: AP Congress: ప్రియాంక గాంధీకి ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు లేఖ

గుడివాడలో తనకు బంధువులు ఉన్నారని చెప్పుకునే చంద్రబాబు.. 14 ఏళ్లు సీఎంగా ఉండి గుడివాడ అభివృద్ధికి ఏం చేశాడో చెప్పాలని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని పేర్కొన్నారు. గుడివాడలో దశాబ్దాల సమస్యల పరిష్కారానికి సీఎం జగన్ ఎంతో కృషి చేస్తున్నారన్నారు. గుడివాడ గడ్డ టీడీపీ అడ్డా అని చెప్పుకునే నేతలు, టీడీపీ హయాంలో ఏం చేశారో చెప్పాలని కొడాలి నాని డిమాండ్ చేశారు. వేలాది కోట్లతో గుడివాడను అభివృద్ధి చేస్తున్న తమను సైకో జగన్, రౌడీ నాని, కబ్జాకోరు, దోపిడీదారుడు అంటూ విమర్శిస్తున్నారని మండిపడ్డారు. గుడివాడలో ఏమైనా ఇసుక రీచ్‌లు, గ్రానైట్ క్వారీలు ఉన్నాయా దోపిడీ చేయడానికి అంటూ ఎద్దేవా చేశారు. ఎక్కడెక్కడో డబ్బు తెచ్చి గుడివాడ అభివృద్ధికి ఖర్చు చేస్తున్నా.. అలాంటి నేను ఎవరి వద్ద నుండి దోపిడీకి పాల్పతాను.. ఎవరి జేబులో చెయ్యిపెట్టినా ఐదు రూపాయలు మించి ఉండవన్నారు.