NTV Telugu Site icon

Gudivada Amarnath : కేంద్ర ప్రభుత్వ సంస్థ సైకీని దళారి సంస్థ అని ఎలా రాస్తారు..

Gudivada

Gudivada

Gudivada Amarnath : వైఎస్ జగన్‌పై గత 15 ఏళ్లగా చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తూనే ఉన్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. ఆదానీ దగ్గర లంచం తీసుకున్నారని ఇప్పుడు ప్రచారం చేస్తున్నారని, దుష్ప్రచారం ఆపకపోతే ఈనాడు ఆంధ్రజ్యోతి పై 100 కోట్లు పరువు నష్టం దావా వేస్తానని జగన్ ప్రకటించారన్నారు. వాస్తవాలను ప్రజల ముందు వైఎస్ జగన్ ఉంచిన దుష్ప్రచారం చేస్తున్నారని, టీడీపీ గెజిట్ పేపర్లు ఈనాడు ఆంధ్రజ్యోతి అదే పనిగా తప్పుడు రాతలు రాస్తున్నారని, విద్యుత్ కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సెకీ మధ్య ఒప్పందం కుదిరిందన్నారు గుడివాడ అమర్నాథ్‌. కేబినెట్ లో చర్చిన తరువాత సైకీతో ఒప్పందం రాష్ట్ర ప్రభుత్వం చేసుకుందని, సైకీ తో ఒప్పందం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేశారన్నారు. కమిటీ అధ్యయనం చేసిన 45 రోజులు తరువాత ఒప్పదం చేసుకున్నామని, కేంద్ర ప్రభుత్వ సంస్థ సైకీని దళారి సంస్థ అని ఎలా రాస్తారన్నారు. విజనరీ అని చెప్పుకొనే చంద్రబాబు 5 రూపాయలకు యూనిట్ విద్యుత్ కంటే జగన్ 2.49 పైసలకు కొన్నారని, వైఎస్ జగన్ ను అదానీ కలిస్తే తప్పు అని ఆయన వ్యాఖ్యానించారు.

Komaram Bheem: కొమురంభీం జిల్లాలో దారుణం.. పులి దాడిలో మహిళ మృతి

అంతేకాకుండా..’అదానీ జగన్ ను కలిస్తే లంచాలు ఇవ్వడానికి వచ్చినట్లు. చంద్రబాబును అదానీ కలిస్తే అది గొప్పగా చెపుతారు.. సెకీ తో అనేక రాష్ట్రాలు ఒప్పందం చేసుకున్నాయి. అన్ని రాష్ట్రాల కంటే తక్కువ రేటుకు ఒప్పదం చేసుకున్నది మన రాష్ట్రమే.జగన్ చేసుకున్న ఒప్పందం తప్పితే ఆ ఒప్పందం తప్పని రద్దు చేయొచ్చుగా. 2.49 కంటే తక్కువ రేటుకు ఒప్పందం చేసుకోవచ్చుగా.. 86 వేల కోట్లు బారం వేసిన చంద్రబాబు గొప్పనా. రాష్ట్రానికి లక్ష పది వేల కోట్లు మిగిల్చిన వైఎస్ జగన్ గొప్పన. ఎన్నికల ముందు విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని చెప్పారు. ఇప్పుడు 20 వేల కోట్లు బారం ప్రజలపై వేస్తున్నారు.. ఇచ్చిన మాట ను చంద్రబాబు నిలబెట్టుకోవాలి. లేదా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తాము..’ అని గుడివాడ అమర్నాథ్‌ వ్యాఖ్యానించారు.

Nara Lokesh : త‌ల్లిదండ్రులు-ఉపాధ్యాయుల మెగా స‌మావేశాన్ని రాజ‌కీయాల‌కు అతీతంగా విజ‌య‌వంతం చేయాలి