Guava Cultivation : జామలో తెగుళ్ల నివారణ చర్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జామ కాయాలకు ప్రతి సీజన్ లో డిమాండ్ ఉంటుంది.. ఇక పింక్ జామను ఈ మధ్య రైతులు ఎక్కువగా పండించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.. వీటిని నాటితే 16 ఏళ్ళు లాభాలను పొందే ఏకైక పంట పింక్ జామ..అందుకే ఈ పంట వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు.ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది రైతులు ఈపంట సాగును చేపట్టారు. అధిక అదాయం చేతికి వస్తుండమే రైతులు ఈ పంటసాగు చేపట్టటానికి కారణం. అయితే పంట ఉత్పత్తి బాగా ఉండాలంటే సరైన యాజమాన్య పద్దతు చేపట్టాల్సిన అవసరం ఉంది.. తెగుళ్లు కూడా ఎక్కువగానే ఉంటాయి.. ఈ జామలో తెగుళ్ల నివారణ చర్యల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఈ జామలో నులిపురుగులు, మిలీబగ్, పండు ఈగ ఈపంటకు అధిక నష్టాన్ని కలిగిస్తాయి. నులిపురుగులు వీటిని నెమటోడ్లు అని కూడా పిలుస్తారు. వేరు మధ్యలో తిష్టవేసుకుని మొక్కకు సరఫరా అయ్యే ఆహారాన్ని తీంటూ వృద్ధి చెందుతాయి. దీని వల్ల మొక్క క్రమంగా ఎండిపోయి చనిపోతుంది. ఈ తెగులు సోకిన చెట్టు వాడిపోయి ఎండిపోతాయి. మొదలు తవ్వి వేరును పరిశీలిస్తే వేర్ల మధ్య ఉబ్బినట్టుండి లోపల గూళ్లు కనబడతాయి.. అందుకే మొక్కలను ఎంపిక చేసుకోవడంలో జాగ్రత్తలు తీసుకోవాలి.. ముఖ్యంగా నర్సరిలో ఈ మొక్కలను తీసుకొనే ముందు వీటిని పరిశీలించి తీసుకోవడం మంచిది..
Also Read
- Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
- Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
ఇక పింక్ జామకు సోకే మరో తెగులు మిలీబగ్. దీనినే పిండినల్లి లేదా రసం పీల్చే పురుగు అంటారు. ఈ తెగులు సోకిన మొక్కలు పేను బంక ఆశించిన మందార చెట్టును పోలి ఉంటాయి. సకాలంలో చర్యలు తీసుకోకుంటే నష్టం జరుగుతుంది. పంటకు నష్టం కలిగించే వాటిలో పండు ఈగ కూడా ఒకటి.. ఇది ఒక్కసారి సోకితే మళ్లీ పోదు.. అందుకే ముందే రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు..
నివారణ చర్యలు…
నెమటోడ్ల నివారణకు 20 కిలోల వేపపిండి నీటిలో వేసి 48 గంటలు నానబెట్టాలి. 200ల లీటర్ల నీటిలో ట్రైకోటెర్మా హరిజోనమ్, సుడోమోనాస్, మైసిస్, లీలాసినస్ లను రెండు కిలోల చొప్పున కలిపి 24 గంటల పాటు నిలువ ఉంచి కలియబెట్టి మొక్కల మొదళ్ల వద్ద పోసి నెమటోడ్లను పూర్తిగా నివారించవచ్చు.పిండి నల్లి నివారణకు లీటరుకు 2గ్రాముల డిటర్జెంట్ పౌడరును కలిపి తెగులు సోకిన చెట్టు పూర్తిగా తడిచేలా పిచికారి చెయ్యాలి.. వారంలో రెండు సార్లు ఇలా చేస్తే నల్లి బాధలు తగ్గుతాయి.. పశువుల ఎరువును ఆఖరి దుక్కిలో వెయ్యడం మంచిదని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు..
తాజావార్తలు
-
Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!