Site icon NTV Telugu

GT vs CSK : టాస్‌ గెలిచిన గుజరాత్‌ టైటాన్స్‌..

Gt Vs Csk

Gt Vs Csk

క్రికెట్‌ ప్రియులు కోటి ఆశలతో ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నాలుగు సంవత్సరాల తర్వాత స్వదేశంలో జరుగుతోంది. అయితే.. ఈ నేపథ్యంలో ప్రారంభ మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్లు తలపడనున్నాయి. అయితే.. గుజరాత్‌ టైటాన్స్‌ జట్టుకు హార్దిక్‌ పాండ్యా సారథ్యం వహిస్తుండగా.. చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుకు మహేంద్ర సింగ్‌ ధోనీ కెప్టెన్‌గా ఉన్నారు. అయితే. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన గుజరాత్‌ టైటాన్స్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో.. ఈ సీజన్‌ తొలి మ్యాచ్‌లో సీఎస్కే బ్యాటింగ్‌ దిగేందుకు సిద్ధమవుతోంది.

Also Read : Killer Plant Fungus: కోల్‌కతా వ్యక్తిలో “కిల్లర్ ప్లాంట్ ఫంగస్ ఇన్ఫెక్షన్”.. ప్రపంచంలోనే మొదటి కేసు

Ipl Ad

ఇదిలా ఉంటే.. మ్యాచ్ రెఫ‌రీగా జ‌వ‌గ‌ల్ శ్రీ‌నాథ్ వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. ఈ స్టేడియంలో జ‌రిగిన ఏడు టీ20 మ్యాచుల్లో మొద‌ట బ్యాటింగ్ చేసిన జ‌ట్టు రెండు సార్లు, ఛేజింగ్ చేసిన టీమ్ ఐదు సార్లు విజయం సాధించింది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్ 16 ఆరంభ వేడుక‌లు అట్ట‌హాసంగా ప్రారంభ‌మ‌య్యాయి. సింగ‌ర్ అర్జిత్ సింగ్ త‌న టీమ్‌తో క‌లిసి బాలీవుడ్ పాట‌ల‌తో స్టేడియాన్ని హోరెత్తించాడు. ఆ త‌ర్వాత మిల్క్ బ్యూటీ త‌మ‌న్నా భాటియా, ఇండియా క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్న డ్యాన్స్‌ల‌తో ఫ్యాన్స్‌ను అల‌రించారు.

Also Read : Shocking : కరోనా తర్వాత పెరిగిన గుండెపోటు మరణాలు.. ఐసీఎంఆర్‌ అధ్యయనంలో షాకింగ్ విషయాలు

Exit mobile version