GT vs SRH Playing 11: మొదట ప్లే-ఆఫ్ చేరేది ఎవరో.!
- ప్లే ఆఫ్ రేసులో కీలకంగా మారిన GT vs SRH మ్యాచ్
- 14 పాయింట్లతో సమానంగా ఉన్న GT, SRH, RCB జట్లు
- పంజాబ్‌పై భారీ విజయం తర్వాత జోరులో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్
- వరుస విజయాలతో మూడో స్థానానికి చేరుకున్న గుజరాత్ టైటాన్స్
- క్యాన్సర్ అవగాహన కోసం లావెండర్ జెర్సీలో బరిలోకి దిగనున్న GT..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
GT vs SRH Playing 11: ఐపీఎల్ 2026 సీజన్ ప్లే ఆఫ్ రేసు మరింత ఉత్కంఠభరితంగా మారింది. మంగళవారం అహ్మదాబాద్‌లో జరగనున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), గుజరాత్ టైటాన్స్ (GT) మ్యాచ్ టాప్-4 సమీకరణాలను పూర్తిగా మార్చే అవకాశముంది. ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, SRH, GT జట్లు 14 పాయింట్లతో సమానంగా ఉండటంతో నెట్ రన్‌రేట్ కూడా కీలకంగా మారింది. సన్ రైజర్స్ హైదరాబాద్ సరైన సమయంలో ఫామ్‌లోకి వచ్చి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. క్రితం మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్‌పై 33 పరుగుల భారీ విజయంతో తమ బ్యాటింగ్ బలాన్ని మరోసారి నిరూపించింది. ఆ మ్యాచ్‌లో SRH 235/4 భారీ స్కోర్ నమోదు చేసింది. అయితే ప్లే ఆఫ్ పోటీ తీవ్రంగా ఉండటంతో ఇకపై ఒక్క ఓటమి కూడా చాలా కాస్ట్లీగా మారుతుంది.
మరోవైపు గుజరాత్ టైటాన్స్ సీజన్ ఆరంభంలో తడబడినా కాస్త లేట్ అయినా ఇప్పుడు అద్భుతంగా పుంజుకుంది. రాజస్థాన్ రాయల్స్‌పై 77 పరుగుల ఘన విజయం సాధించి మూడో స్థానానికి చేరుకుంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో GT జట్టు టోర్నీ కీలక దశలో బాగా పుంజుకుంది. ఈ సీజన్లో అత్యంత ప్రమాదకర బ్యాటింగ్ లైనప్ కలిగిన జట్లలో SRH ఒకటి. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్‌లతో కూడిన టాప్ ఆర్డర్ ప్రత్యర్థి బౌలర్లపై మొదటి నుంచే దాడి చేస్తోంది. ఈ సీజన్లో SRH ఇప్పటికే ఎనిమిది సార్లు 200కు పైగా స్కోర్లు నమోదు చేసింది. ముంబై ఇండియన్స్‌పై 249 పరుగులు చేయడం వారి బ్యాటింగ్ దూకుడు ఏంటో అర్థమవుతుంది.
Also Read
- Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
- IND vs ENG 2nd ODI: వన్డే సిరీస్‌పై కన్నేసిన టీమిండియా.. నేడు రెండో వన్డే.! పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ XI, మ్యాచ్ వివరాలు ఇవే..!
- Thursday Horoscope: ఆ రాశివారు అనుకున్న పనుల అంచనాలు తారుమారతాయి.. జాగ్రత్త సుమీ..!
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
కెప్టెన్ పాట్ కమిన్స్ గాయంతో బయటకు వెళ్లి తిరిగి జట్టులో చేరడం బౌలింగ్ విభాగానికి పెద్ద బలం ఇచ్చింది. శ్రీలంక పేసర్ ఈషాన్ మలింగ ఈ సీజన్లో అత్యుత్తమ బౌలర్లలో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఇప్పటికే 16 వికెట్లు తీసిన మలింగ కీలక సమయంలో వికెట్లు సాధిస్తూ SRH బౌలింగ్ లో కీలకంగా మారాడు. అయితే SRH దూకుడు కొన్నిసార్లు బలహీనతగా మారుతోంది. ప్రారంభంలో వికెట్లు కోల్పోతే మిడిల్ ఆర్డర్ ఒత్తిడిలో పడుతోంది. ఫీల్డింగ్ లోపాలు కూడా కొన్ని మ్యాచ్‌ల్లో జట్టుకు నష్టం చేశాయి.
మరోవైపు గుజరాత్ విజయాల్లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ ఇద్దరూ టాప్ ఆర్డర్లో బీకర ఫామ్ లో ఉన్నారు. మొదట ఇన్నింగ్స్ ను సెట్ చేసి, ఆ తర్వాత భారీ షాట్లతో విరుచుక పడడం వ్యూహంగా మారింది. జోస్ బట్లర్, వాషింగ్టన్ సుందర్ వంటి అనుభవజ్ఞులు మిడిల్ ఆర్డర్‌కు బలం చేకూరుస్తున్నారు. ఇక బౌలింగ్ లో మొహమ్మద్ సిరాజ్, కగిసో రబాడా వేగంతో ప్రత్యర్థులను ఇబ్బంది పెడుతుండగా.. రషీద్ ఖాన్ మధ్య ఓవర్లలో కీలక వికెట్లు సాధిస్తున్నాడు. సీజన్ ఆరంభంలో ఫామ్ కోల్పోయిన GT బౌలింగ్ యూనిట్ ఇప్పుడు మరింత సమతూకంగా కనిపిస్తోంది. అయితే టాప్ ఆర్డర్ విఫలమైతే లోయర్ మిడిల్ ఆర్డర్‌పై అధికంగా ఆధారపడటం మాత్రం ఇంకా ఆందోళన కలిగించే అంశంగానే ఉంది.
ఈ కీలక మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ప్రత్యేక లావెండర్ జెర్సీతో బరిలోకి దిగనుంది. క్యాన్సర్ పై అవగాహన పెంచేందుకు ఫ్రాంచైజీ చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. సమయానికి వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరాన్ని ప్రజలకు తెలియజేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. IPLలో ఈ రెండు జట్లు ఇప్పటివరకు ఆరు సార్లు తలపడ్డాయి. అందులో గుజరాత్ టైటాన్స్ ఐదు విజయాలు సాధించి పూర్తి ఆధిపత్యం చాటింది. అహ్మదాబాద్‌లో అయితే SRHపై గుజరాత్ కి 100% విజయాల రికార్డ్ ఉంది.
ప్లేయింగ్ 11 (అంచనా):
గుజరాత్ టైటాన్స్ (GT):
శుభ్‌మన్ గిల్ (C), సాయి సుదర్శన్, జోస్ బట్లర్, వాషింగ్టన్ సుందర్, జేసన్ హోల్డర్, రాహుల్ తేవాటియా, రషీద్ ఖాన్, కగిసో రబాడా, మొహమ్మద్ సిరాజ్, అర్షద్ ఖాన్, సాయి కిషోర్.
సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH):
అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, నితీశ్ కుమార్ రెడ్డి, ఆర్. స్మరణ్, పాట్ కమిన్స్ (C), ఈషాన్ మలింగ, శివాంగ్ కుమార్, హర్షల్ పటేల్, సాకిబ్ హుస్సేన్.
తాజావార్తలు
-
The Paradise Rights : ప్యారడైజ్ రైట్స్ కోసం రూ. 110 కోట్లు అఫర్ చేసిన దిల్ రాజు.. పుకార్లు నమ్మొద్దన్న నిర్మాత
-
Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
-
Dhanush – Anirudh : ధనుష్ – అనిరుధ్ మధ్య ఫ్రెండ్షిప్ చెడిందా..?
-
Kia Syros EV: 526KM రేంజ్, లెవెల్-2 ADAS భద్రతా ఫీచర్లతో.. కియా సైరోస్ EV భారత్ లో విడుదల
-
IND vs ENG 2nd ODI: వన్డే సిరీస్‌పై కన్నేసిన టీమిండియా.. నేడు రెండో వన్డే.! పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ XI, మ్యాచ్ వివరాలు ఇవే..!
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!