NTV Telugu Site icon

Pawan Kalyan: కాశీలో సామాన్యుల్లా ఆటోలో ప్రయాణం చేసిన డిప్యూటీ సీఎం పిల్లలు

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: ఎంత పెద్ద స్థాయిలో ఉన్న ఒదిగి ఉండే తత్వం కొంత మందికే ఉంటుంది. అలాంటి వ్యక్తుల లిస్ట్ లో తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే పేరు పవన్ కళ్యాణ్. టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందినా, తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకున్న తర్వాత కూడా ఎక్కడా అతనికి గర్వం తలకెక్కలేదని స్నేహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే కాదు, బయటివారు కూడా ప్రశంసిస్తారు. టాలీవుడ్‌లో పవర్ స్టార్‌గా స్టార్ హీరోగానే కాదు, ఆ తర్వాత రాజకీయాల్లో అడుగుపెట్టి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పదవి చేపట్టినప్పటికీ, పవన్ కళ్యాణ్ తన నడవడిక, ఇతరుల పట్ల ప్రేమను ఎప్పుడూ మరచిపోలేదు. ఇకపోతే ఆయన పిల్లలు అకిరా నందన్, ఆద్య కూడా సామాన్య జీవనానికి దగ్గరగా గడిపేస్తున్నారు. అందుకు నిదర్శనంగా అకిరా, ఆద్యలు తమ తల్లి రేణు దేశాయ్‌తో కలిసి ఇటీవల వారణాసికి వెళ్లారు. అక్కడి ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శించి, సామాన్య భక్తులుగా గంగమ్మను పూజించారు. ఈ సందర్భంగా అకిరా హిందూ సంప్రదాయ దుస్తుల్లో కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Also Read: Liquor Sales: మందుబాబులకు ఏపీ సర్కార్‌ శుభవార్త.. అర్ధరాత్రి వరకు లిక్కర్‌ అమ్మకాలు

వారాణాసి పుణ్యక్షేత్రంలో అకిరా, ఆద్యలు ఆటోల్లో ప్రయాణిస్తూ అక్కడి ప్రసిద్ధ దేవాలయాలను దర్శించారు. వారణాసి రోడ్లపై వీరిని చూసిన కొందరు అభిమానులు గుర్తించారు కూడా. ఆ సమయంలో తీసిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఈ వీడియోలను, ఫోటోలను చూసిన పవన్ అభిమానులు, సోషల్ మీడియా వినియోగదారులు అకిరా, ఆద్యల తండ్రికి తగ్గ పిల్లలంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. పిల్లలను విలాసాలకు దూరంగా, సామాన్య జీవితం అర్థం అయ్యేలా పెంచుతున్న రేణు దేశాయ్‌పై నెటిజన్లు ప్రశంసలు గుప్పిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పిల్లలు ఆధ్యాత్మికతతో పెరిగి తండ్రి ఆశయాలకు అనుగుణంగా తమ జీవితాన్ని తీర్చిదిద్దుకుంటున్నారు అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

Show comments