Greenland Deal: ట్రంప్ ఆశ నెరవేరింది.. గ్రీన్‌ల్యాండ్‌పై డెన్మార్క్‌తో డీల్..
- నెరవేరుతున్న ట్రంప్ ఆశ..
- గ్రీన్‌ల్యాండ్‌పై డెన్మార్క్‌తో డీల్..
- ఒప్పందం ఉంటుందని స్పష్టం చేసిన డెన్మార్క్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Greenland Deal: గ్రీన్‌ల్యాండ్ కోసం పరితపిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరిక నెలవేరే సమయం వచ్చింది. అమెరికా, డెన్మార్క్‌లు గ్రీన్‌ల్యాండ్ భద్రతా ఒప్పందంపై సంతకాలు చేయబోతున్నాయి. డెన్మార్ ప్రధాని మెట్టే ఫ్రెడరిక్సన్ మాట్లాడుతూ.. ఇది నాటో, యూరప్‌కు మంచిదే అని అన్నారు. డెన్మార్క్ స్వయంప్రతిపత్తి ప్రాంతంగా గ్రీన్‌ల్యాండ్ ఉంది. గ్రీన్‌ల్యాండ్‌లో భద్రతను బలోపేతం చేయడమే ఈ ఒప్పందం లక్ష్యంగా తెలుస్తోంది. ఈ ఒప్పందం ఆర్కిటిక్, ఉత్తర అట్లాంటిక్ ప్రాంతాల్లో ఉమ్మడి భద్రతను బలోపేతం చేస్తుందని ఫ్రెడరిక్సన్ అన్నారు. వచ్చే వారం ఐక్యరాజ్యసహితి జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశం ఉందన్నారు. ఈ ఒప్పందం డెన్మార్క్ సార్వభైమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను, గ్రీన్‌ల్యాండ్ ప్రజల స్వీయ నిర్ణయాధికార హక్కును గుర్తిస్తుందని డెన్మార్క్ ప్రధాని చెప్పారు.
ట్రంప్ కీలక ప్రకటన..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం డెన్మార్క్‌తో ఒప్పందం కుదిరిందని ప్రకటించారు. గ్రీన్‌ల్యాండ్ భద్రతపై అమెరికాకు శాశ్వత నియంత్రన లభిస్తుందని, అమెరికా ప్రత్యర్థులు సైనిక స్థావరాలు, పెట్టుబడులు పెట్టకుండా ఈ ఒప్పందం నిరోధిస్తుందని అన్నారు. మరోవైపు, గ్రీన్‌ల్యాండ్ ప్రభుత్వ చీఫ్ జెన్స్ -ఫ్రెడరిక్ నీల్సన్ కూడా ఈ ఒప్పందాన్ని స్వాగతించారు. గ్రీన్ ల్యాండ్ భద్రతను ఇది బలోపేతం చేస్తుందని అన్నారు.
Also Read
- Trump-Jinping: 24న వైట్‌హౌస్‌లో జిన్‌పింగ్‌కు విందు.. మస్క్, సుందర్ పిచాయ్, టిమ్ కుక్కు ఆహ్వానం
- Explainers: భూమి గుండెల్లో దాగిన నీటి రహస్యం.. ఏకంగా 660 కిలోమీటర్ల లోతులో..
- America vs Iran: అమెరికా యుద్ధ నేరాలకు సాక్ష్యాలు.. పిల్లలను కూడా వ*దలలేదు..!
- Iran Hijab Law: ఇరాన్లో హిజాబ్ నిబంధనలకు సవాల్.. స్కార్ఫ్ లేకుండానే 10K రేసులో పాల్గొన్న మహిళలు
నెరవేరుతున్న ట్రంప్ ఆశ..
2025 జనవరిలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ట్రంప్ గ్రీన్‌ల్యాండ్‌పై కన్నేశారు. వ్యూహాత్మక కారణాల వల్ల ఆ ప్రాంతాన్ని అమెరికా తన ఆధిపత్యంలోకి తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు విక్రయించాలని డెన్మార్క్‌పై ఒత్తిడి తీసుకువచ్చారు. అయితే, గ్రీన్‌ల్యాండ్‌ను అమ్మేది లేదని డెన్మార్క్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో నాటో మిత్రదేశాల మధ్య గ్రీన్‌ల్యాండ్ వ్యవహారం ఉద్రిక్తతకు దారి తీసింది. తాజాగా గ్రీన్‌ల్యాండ్‌పై ఒప్పందం జరగబోతుండటం గమనార్హం. కొన్ని నివేదికల ప్రకారం.. ఉత్తర గ్రీన్‌ల్యాండ్‌లో ఇప్పటికే ఉన్న పిటుఫిక్ స్థావరానికి అదనంగా, దక్షిణ భాగంలో మరో మూడు అమెరికా సైనిక స్థావరాలను ఏర్పాటు చేయాలని భావిస్తోంది.
తాజావార్తలు
-
Greenland Deal: ట్రంప్ ఆశ నెరవేరింది.. గ్రీన్‌ల్యాండ్‌పై డెన్మార్క్‌తో డీల్..
-
Ajit Doval: సినిమాను మించిన థ్రిల్లర్! అజిత్ డోవల్ పంచుకున్న అత్యంత ప్రమాదకరమైన సీక్రెట్ మిషన్..
-
Trump-Jinping: 24న వైట్‌హౌస్‌లో జిన్‌పింగ్‌కు విందు.. మస్క్, సుందర్ పిచాయ్, టిమ్ కుక్కు ఆహ్వానం
-
Explainers: భూమి గుండెల్లో దాగిన నీటి రహస్యం.. ఏకంగా 660 కిలోమీటర్ల లోతులో..
-
మార్కులు, డిగ్రీలకు మించి: ‘హ్యూమన్ స్కిల్ పాస్‌పోర్ట్’ను పరిచయం చేస్తున్న HIPSA & Power Sportz
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!