వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడి 300 మందికి పైగా మరణించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమ కనుమలను పర్యావరణ సున్నిత ప్రాంతం (ఈఎస్‌ఏ)గా ప్రకటించేందుకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ముసాయిదా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. కొండచరియలు విరిగిపడటం వల్ల సంభవించిన విషాదంలో వందలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయిన వయనాడ్ గ్రామాలు కూడా ఇందులో ఉన్నాయి. వయనాడ్‌లో ఇప్పటికీ ఇంకా సహాయ చర్యలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం 100 మందికి పైగా గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు.
READ MORE: Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌లో ఎనిమిదో రోజు భారత్ షెడ్యూల్ ఇదే..
ప్రభుత్వ ముసాయిదాలో 6 రాష్ట్రాలలో 59940 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మేర ఈఎస్‌ఏ ఎంపిక చేయబడింది. ఇది పశ్చిమ కనుమల్లో దాదాపు 37 శాతం. 2022లో కూడా ఇదే విధమైన డ్రాఫ్ట్ విడుదలైంది. ప్రఖ్యాత పర్యావరణవేత్త మాధవ్ గాడ్గిల్ కమిటీ 2011లోనే దీన్ని సిఫార్సు చేసింది. 13 ఏళ్ల తర్వాత ఆయన నివేదికపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అయితే ఈ నివేదికలో 75 శాతం విస్తీర్ణాన్ని ఈఎస్‌ఏ పరిధిలోకి తీసుకురావాలని సిఫారసు చేయగా, దానిని 37 శాతానికి తగ్గించారు. ముసాయిదా గడువు ముగియడంతో కొత్త నోటిఫికేషన్‌ను విడుదల చేసినట్లు మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి తెలిపారు.
READ MORE:Khairatabad Ganesh: ఈ ఏడాది ‘సప్తముఖ మహశక్తి గణపతి’గా ఖైరతాబాద్ గణేశ్
ప్రస్తుతం మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఇప్పుడు కేరళ సహా ఇతర రాష్ట్రాల నుంచి ఫీడ్ బ్యాక్ వచ్చిన తర్వాత తుది నివేదికను సిద్ధం చేయనున్నారు. వయనాడ్‌లో విషాదం కారణంగా ఈ ముసాయిదాను సిద్ధం చేసినట్లు నిపుణులు చెబుతున్నారు.