NTV Telugu Site icon

IND-W vs BAN-W: బంగ్లాదేశ్పై ఘన విజయం.. ఫైనల్స్కు భారత్

Ind W

Ind W

మహిళల ఆసియా కప్లో భాగంగా.. ఈరోజు బంగ్లాదేశ్తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. 10 వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ సాధించింది. 81 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ఓపెనర్లు కేవలం 11 ఓవర్లలోనే ఛేదించారు. భారత్ ఓపెనర్లు స్మృతి మంధాన (55*), షఫాలీ వర్మ (26*) పరుగులు చేశారు. దీంతో.. భారత జట్లు ఫైనల్స్లోకి ప్రవేశించింది. ఈరోజు రాత్రి శ్రీలంక- పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. అందులో ఏ టీమ్ గెలుస్తే.. ఆ టీమ్తో ఎల్లుండి భారత్ అమీతుమీ తేల్చుకోనుంది.

Read Also: Priyanka Gandhi: గాజాపై ఇజ్రాయెల్ చర్యలను ఖండించిన ప్రియాంక గాంధీ..

అంతకుముందు బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 80 పరుగులు మాత్రమే చేసింది. భారత్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి బంగ్లా జట్టును స్కోరు చేయకుండా కట్టడి చేశారు. దీంతో.. బంగ్లా తక్కువ స్కోరు చేసింది. బంగ్లా బ్యాటింగ్లో కెప్టెన్ నిగర్ సుల్తానా అత్యధికంగా (32) పరుగులు చేసింది. ఆ తర్వాత.. శోర్ణా అక్తర్ (19) రన్స్ సాధించింది. మిగతా అందరు బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. ఇండియా బౌలింగ్లో రేణుకా సింగ్, రాధా యాదవ్ చెరో 3 వికెట్లు తీశారు. ఆ తర్వాత పూజా వస్త్రాకర్, దీప్తి శర్మ తలో వికెట్ సాధించారు.

Read Also: Ethiopia Floods: ఇథియోపియాలో ఘోర విషాదం.. 257కి చేరిన మృతుల సంఖ్య