Metro Free Service: దేశ రాజధాని ప్రజలకు మెట్రో ప్రయాణం చాలా సౌకర్యవంతంగా పరిగణించబడుతుంది. మెట్రోలో చౌక ధరల కారణంగా ప్రజలు తక్కువ డబ్బుతోనే ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ప్రయాణించగలుగుతున్నారు. అయితే ఢిల్లీలో కష్టపడి పనిచేస్తున్న కార్మికులకు ఢిల్లీ ప్రభుత్వం ఉచితంగా మెట్రో సేవలను అందించేందుకు సన్నాహాలు చేస్తోంది. గతంలో.. ఢిల్లీ ప్రభుత్వం కార్మికులకు బీమా నుండి ఉచిత బస్సు ప్రయాణం వరకు అనేక ముఖ్య ప్రకటనలు చేసింది. ఇప్పుడు అందుతున్న తాజా సమాచారం ప్రకారం.. కార్మికులకు ఉచిత మెట్రో సేవలను అందించడానికి ఢిల్లీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది.
ఈ మేరకు ఢిల్లీ కార్మిక మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ కార్మికులకు ఉచిత మెట్రో సేవలను అందించడానికి ఇటీవల ఓ సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత ఈ విషయంపై (డిటిసి) ఉచిత సేవ గురించి డిఎంఆర్‌సికి లేఖ రాసినట్లు సమాచారం. ఢిల్లీ మెట్రోలో, ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ వారికి అందించే విధంగానే కార్మికులకు ఉచితంగా ప్రయాణించడానికి ఒక నెల పాస్‌ను అందుబాటులో ఉంచాలని కోరారు. కాగా, ఈ విషయమై మీడియా ప్రశ్నించగా డీఎంఆర్సీ.. ఇప్పటివరకు తమకు అలాంటి లేఖ ఏదీ రాలేదని, అలాంటి ప్రతిపాదన ఏదైనా వస్తే దానిపై ఖచ్చితంగా చొరవ తీసుకుంటామని వారు చెప్పారు.
Read Also:Sabitha Indra Reddy: ఫెయిలైతే సప్లిమెంటరీ ఉంది.. ఇంటర్ స్టూడెంట్లు చనిపోవడంతో బాధేసింది
ఢిల్లీ కార్మికుల కోసం అనేక పథకాలు
ఢిల్లీ ప్రభుత్వం ఉచిత బస్సు సర్వీస్, కార్మికుల జీతం, పిల్లల విద్య, బీమా, కుటుంబ భవిష్యత్తు కోసం అనేక పథకాలను అమలు చేస్తోంది. ఇప్పుడు మెట్రోలో ఉచిత ప్రయాణం కార్మికులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే కొత్త అప్‌గ్రేడ్ సిస్టమ్, టోకెన్, స్మార్ట్ కార్డ్ రీఛార్జ్ ద్వారా మాత్రమే మెట్రో గేట్ వద్ద ప్రయాణికుల ప్రవేశ, నిష్క్రమణ జరుగుతుంది. అటువంటి పరిస్థితిలో ప్రత్యేక పాస్ లాంటి ఏర్పాట్ల కోసం DMRC తన వ్యవస్థను కూడా మార్చవలసి ఉంటుంది. అది అంత సులభం కాదు. ఢిల్లీ ప్రభుత్వం, DMRC మధ్య మెరుగైన సమన్వయంతో కార్మికులు ఈ ఉచిత సదుపాయం ప్రయోజనాన్ని ఎంతకాలం పొందుతారనేది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారనుంది.