NTV Telugu Site icon

Minister Nadendla Manohar: ఏపీలో అక్టోబర్ 1 నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం

Nadendla Manohar

Nadendla Manohar

Minister Nadendla Manohar: అక్టోబర్‌ 1 నుంచి ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించనున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. 10 జిల్లాల జాయింట్ కలెక్టర్లతో సమావేశం నిర్వహించామన్నారు. జేసీలు, డీఎస్వోలతో మంత్రి మరోసారి భేటీ కానున్నారు. ఖరీఫ్ సీజన్‌లో ధాన్యం కొనుగోళ్లపై చర్చించనున్నారు. కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతులు ఖాతాల్లోకి డబ్బులు చెల్లిస్తామన్నారు.

ముందస్తుగా పెద్ద సంఖ్యలో లారీలను సిద్ధం చేశామన్నారు. ప్రతి వాహనానికి జీపీఎస్ అనుసంధానం చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో పంట నష్టం, తడిచిన ధాన్యానికి సంబంధించి విధి విధానాలు రెండు రోజుల్లో ప్రకటిస్తామన్నారు. రైతు నష్టపోకుండా పండించిన ప్రతి గింజ కొంటామన్నారు. వైసీపీ ప్రభుత్వం 100 రోజుల్లో ఎన్ని పథకాలు అమలు చేసిందని ఆయన ప్రశ్నించారు. గత ప్రభుత్వం పెండింగులో పెట్టిన రూ. 1700 కోట్ల నిధులను రైతులు ఖాతాల్లో వేశామన్నారు. ఐదేళ్లల్లో వైసీపీ పరిపాలన గురించి ఒక్కరోజు కూడా గర్వంగా చెప్పుకోలేకపోయారన్నారు. మా వంద రోజుల పరిపాలనను ప్రజలు గమనించారని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.