NTV Telugu Site icon

Sub Registrar Offices: రాచరిక పోకడలకు స్వస్తి.. స్వయంగా పోడియం పగలగొట్టిన రెవెన్యూ స్పెషల్ సీఎస్ సిసోడియా

Andhra Pradesh

Andhra Pradesh

Sub Registrar Offices: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రాజరికపు పోకడలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వస్తి పలికింది. కోర్టుల్లో జడ్జిల తరహాలో సబ్ రిజిస్ట్రార్లు కూర్చొనే విధానానికి రిజిస్ట్రేషన్లుశాఖ చెల్లు చీటి పలికింది. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల రూపురేఖలు మార్చే అంశంపై ప్రభుత్వం దృష్టి సారించింది. తాజాగా.. విజయవాడలోని గుణదల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రార్ పోడియంను రెవెన్యూ సీఎస్ సిసోడియా స్వయంగా పగలగొట్టారు. చుట్టుగుంట సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో డయాస్, స్టేజ్‌లను‌ తొలగించే కార్యక్రమాన్ని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా, ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ రావు ప్రారంభించారు. ఇటీవల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సబ్ రిజిస్ట్రార్ కూర్చొనే స్టేజి‌, చుట్టూ పోడియం లాగా కోర్టుల్లో వున్న విధానాన్ని తొలగించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.

Read Also: Ram Mohan Naidu: విశాఖ-దుర్గ్‌ వందేభారత్‌ రైలును ప్రారంభించిన కేంద్ర మంత్రి

ఒప్పుడు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాలంటే ‌ప్రజలు భయపడేవారని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా వెల్లడించారు. తాను కూడా భయపడేవాడినని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే జనం పట్ల మర్యాద పూర్వకంగా చూడాలని సీఎం చంద్రబాబు చెప్పారన్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజలను మర్యాద పూర్వకంగా చూడాలన్నారు. కోర్టులాగా‌ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు వుండేవని.. సబ్ రిజిస్ట్రార్‌కు స్టేజి‌ వుండేదని.. చుట్టూ పోడియం వుండేదని చెప్పారు. ఆ వాతావరణం చూస్తే కోర్టుకు వచ్చినట్లుగా ఉండేదన్నారు. ఈ పద్ధతి మార్చాలని సర్క్యూలర్ ఇచ్చామన్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే వారు కోర్టుకు వచ్చినట్లు‌ వుండకూడదన్నారు.

బ్రిటీష్ కాలం నుండి‌ ఉన్న అట్మాస్పియర్ మార్చాలని సీఎం చంద్రబాబు నిర్మాణం తీసుకున్నారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ రావు అన్నారు. మన ప్రభుత్వం.. మనకు సేవ‌ చేసేందుకే అధికారులున్నారని అన్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చేవారితో ఫ్రెండ్లీ అట్మాస్పియర్ వుండాలన్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో డయాస్‌ను పగులగొట్టే కార్యక్రం చేశామన్నారు.

Show comments