సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రాజరికపు పోకడలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వస్తి పలికింది. కోర్టుల్లో జడ్జిల తరహాలో సబ్ రిజిస్ట్రార్లు కూర్చొనే విధానానికి రిజిస్ట్రేషన్లుశాఖ చెల్లు చీటి పలికింది. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల రూపురేఖలు మార్చే అంశంపై ప్రభుత్వం దృష్టి సారించింది. తాజాగా.. విజయవాడలోని గుణదల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రార్ పోడియంను రెవెన్యూ సీఎస్ సిసోడియా స్వయంగా పగలగొట్టారు.
రేపు వినాయక చవితి సందర్భంగా.. ప్రభుత్వం ఏ ఆంక్షలూ విధించలేదని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ స్పష్టంచేశారు. అంతేకాదు, గణేష్ మండపాల అనుమతిని సులభతరం చేశామని తెలిపారు. ఎటువంటి అవాంతరాలు జరగకుండా గతంలో అగ్నిమాపక, పోలీసు, విద్యుత్ శాఖలు, మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అనుమతి కోసం వేర్వేరుగా దరఖాస్తు చేయాల్సి వచ్చేదన్నారు. అయితే.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక సింగిల్ విండో విధానాన్ని తెచ్చిందని తెలిపారు. గణేష్ మండపాల రుసుము ఒక్క రూపాయి కూడా పెంచలేదని, గత ప్రభుత్వ…