NTV Telugu Site icon

Governor Jishnu Dev: ఆదివాసీ పిల్లలు ఇంగ్లీష్‌లో మాట్లాడటం ఆనందదాయకం..

Governor Jishnu Dev

Governor Jishnu Dev

తాను దత్తత తీసుకున్న కొండపర్తి గ్రామానికి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ రోడ్డు మార్గాన చేరుకున్నారు. మంత్రి సీతక్క, కిషోర్ ప్రినిపల్ సెకరెట్రి, కలెక్టర్ దివాకర, ఐటీడీఏ పీఓ చిత్ర మిశ్రా ఘన స్వాగతం పలికారు. ఆదివాసీలు వారి నృత్యాలతో ఆకట్టుకున్నారు. కుమురం భీమ్, బిర్శా ముండా విగ్రహాలకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, మంత్రి సీతక్క ఆవిష్కరించారు. పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామ అభివృద్ధి నిమిత్తం రూ. కోటి 50 లక్షల విలువైన పనులు ప్రారంభించారు. మహిళల కోసం ఏర్పాటు చేసిన కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. అగన్వాడీ కేంద్రంలో విద్యార్థులతో అక్షరాభ్యాసం చేయించారు. మహిళల కొరకు మిర్చి యూనిట్, మసాల, పసుపు, పిండి యూనిట్ ప్రారంభించారు.

READ MORE: SSMB-29: హనుమంతుడి స్ఫూర్తితో ఎస్ ఎస్ ఎంబీ-29 కథ.. అదిరిపోయే ఫ్లాష్ బ్యాక్..?

ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణు దేవ్ మాట్లాడుతూ.. “ఆదివాసీలు వెనకబడి ఉన్నారు కాబట్టి అధికారులందరూ కలిసి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలి. ఇక్కడ పిల్లలు ఇంగ్లీష్ లో మాట్లాడం చాలా ఆనందం అనిపించింది. ఈ కొండపర్తి గ్రామాన్ని దేశంలో రోల్ మోడల్ గ్రామంగా తీర్చిదిద్దాలి. నేను ఆదివాసీ కుటుంబం నుంచి వచ్చాను. మా గ్రామం కూడా నా చిన్నప్పుడు కొండపర్తిలానే ఉండేది.
కొండపర్తిలో తయారుచేసే మసాలా, కారం, పసుపు ఒక ప్రత్యేక బ్రాండ్ లు గా నిలవాలి.” అని ఆయన పేర్కొన్నారు.

READ MORE: Group-2 Results: గ్రూప్ 2 ఫలితాలు విడుదల