NTV Telugu Site icon

Anand Bose: హోంమంత్రి అమిత్ షాతో గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ భేటీ.. రాష్ట్రపతి పాలనపై ఊహాగానాలు!

Amith Shah Governor Anand Bose

Amith Shah Governor Anand Bose

పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ శుక్రవారం ఢిల్లీలో హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. గవర్నర్ గురువారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. రాష్ట్రంలోని తాజా సమస్య అయిన మహిళా ట్రైనీ డాక్టర్ అత్యాచారానికి సంబంధించిన పరిస్థితులపై చర్చించనున్నారు. ఆనందర్ బోస్ ఈ కేసుకి సంబంధించిన సమగ్ర వివరాలు షాకి సమర్పించనున్నారు. గత వారం కూడా గవర్నర్ సివి ఆనంద్ బోస్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపాధ్యక్షుడు జగదీప్ ధన్‌ఖర్‌లను కలిశారు. ఆర్జీకర్ ఆస్పత్రి కేసును తెలియజేశారు.

READ MORE: Mathu Vadalara 2 Teaser: వెల్‌కమ్‌ టు ‘హీ’ టీమ్‌.. ఫన్నీగా ‘మత్తు వదలరా 2’ టీజర్‌!

హోంమంత్రితో గవర్నర్ భేటీ తర్వాత పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించవచ్చా అనే చర్చలు మరోసారి ఊపందుకున్నాయి. వాస్తవానికి.. కోల్‌కతాలోని ఆర్‌జి కర్ హాస్పిటల్‌లో అత్యాచారం-హత్య కేసు తరువాత రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ ఘటనను రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంగా గవర్నర్ అభివర్ణించారు. ఈ మొత్తం వ్యవహారంపై గవర్నర్
సీవీ ఆనంద్ బోస్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, బెంగాల్ పోలీసులను నేరస్థులని ఆరోపించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే ప్రశ్నకు కూడా సమాధానం ఇచ్చారు. బెంగాల్‌లో ప్రజాస్వామ్యం లేదన్నారు. మమతా బెనర్జీ ప్రభుత్వం ప్రజల అంచనాలను అందుకోలేకపోయిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. తన బాధ్యతను ఏమాత్రం నెరవేర్చలేదని మండిపడ్డారు. సీఎం పదవికి రాజీనామా చేయాలన్నారు. అలాగే, పోలీసు కమిషనర్‌ను కూడా వెంటనే తొలగించాలన్నారు. తాను బెంగాల్ ప్రయోజనాల కోసం పని చేస్తూనే ఉంటానన్నారు.