NTV Telugu Site icon

Governor Biswabhusan Harichandan: గిరిజన యువత ఉన్నతవిద్యావకాశాలు పొందాలి

Govr

Govr

రాష్ట్రంలో గిరిజన యువత ఉన్నత విద్య ఉద్యోగాలు పొందేలా నైపుణ్యం సాధించడంలో శిక్షణ పొందాలని పిలుపునిచ్చారు ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్. నంద్యాల జిల్లా బలపనూర్ గిరిజన పాఠశాలలో గిరిజనులు, గిరిజన విద్యార్థులతో గవర్నర్ ముఖాముఖి మాట్లాడారు. 28 శాతం గిరిజన జనాభా ఉన్న ఒడిస్సా నుంచి వచ్చానని, గిరిజనుల సమస్యలపై అవగాహన ఉందన్నారాయన. గిరిజనులను ఆధునిక జీవితానికి అలవాటు చేస్తూనే సంస్కృతి సంప్రదాయాలు రక్షించడానికి సమతుల్యత పాటించడం ఒక సవాల్ ఉందన్నారు గవర్నర్.

Read also:Greater Noida: యువతిపై సామూహిక అత్యాచారం.. వీడియోలు తీసి బ్లాక్ మెయిల్

ఏపీలో గిరిజనుల విద్యకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గిరిజన ప్రాంతాలలో ప్రాథమిక విద్య, ఆరోగ్యంపై దృష్టి సారిస్తోందన్నారు, విద్య , ఆరోగ్యం అతి ముఖ్యమైన విషయాలని ప్రభుత్వం గుర్తించిందన్నారు గవర్నర్. పరిశుభ్రత, తాగునీటికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గిరిజనులు తమ పిల్లలను బాగా చదివించి దేశానికి ఉపయోగపడేలా చూడాలన్నారు. మారుమూల గిరిజనులు ఆసుపత్రికి వెళ్లాలంటే డోలీల్లో తీసుకెళ్తున్నారని, అలాంటి ప్రాంతాల్లో గిరిజనులు స్వయంగా రోడ్లు వేసుకున్న సంఘటనలు ఉన్నాయన్నారు గవర్నర్. ప్రధాని సడక్ యోజన నిధులతో గిరిజన ప్రాంతాలకు రోడ్లు వేసేందుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.

Read also:Ricky Ponting: ఐపీఎల్‌లో పంత్ ఆడకున్నా పక్కనే కూర్చోబెట్టుకుంటా