గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో సమావేశం అయ్యారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. రాజ్‌భవన్ వెళ్లి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సుప్రవ హరిచందన్ దంపతులను మర్యాద పూర్వకంగా కలిశారు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, భారతి దంపతులు… ఇక, సుమారు గంట పాటు గవర్నర్-సీఎం మధ్య చర్చలు జరిగాయి.. సమకాలిన రాజకీయ, సామాజిక అంశాలపై లోతుగా చర్చించారు.. కొత్త జిల్లాల వ్యవస్థతో పాలన.. ప్రజలకు మరింత చేరువైనట్టు గవర్నర్ కు వివరించారు సీఎం జగన్.. నూతన జిల్లాల్లో…
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మంత్రివర్గం కొలువుదీరింది.. పాత మంత్రులతో జరిగిన చివరి కేబినెట్ సమావేశంలో.. అందరితో రాజీనామాలు చేయించిన సీఎం వైఎస్ జగన్.. పాత కొత్త మంత్రుల కలయికతో ఆదివారం రోజు తన కొత్త టీమ్‌ను ప్రకటించారు.. ఇక, ఇవాళ మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించారు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్.. 25 మంది కొత్త మంత్రుల చేత ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది.. ప్రమాణ స్వీకార ఘట్టంలో మొదట సత్తెనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రమాణ స్వీకారం…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్‌తో సమావేశం అయ్యారు.. రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని తాడేపల్లి చేరుకున్న సీఎం జగన్.. ఇవాళ సాయంత్రం రాజ్‌భవన్ వెళ్లి గవర్నర్ విశ్వభూషణ్‌తో భేటీ అయ్యారు.. కేబినెట్ పునర్ వ్యవస్థీకరణపై పూర్తి వివరాలను వెల్లడించారు.. ఈ నెల 11న మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ చేపట్టనున్నట్లు గవర్నర్‌కి తెలిపిన ఆయన.. అదే రోజు కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించాలని కోరారు. ఇందుకు సంబంధించి నూతన మంత్రుల జాబితా…
ఏపీ వ్యాప్తంగా 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విజయవాడలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ప్రభుత్వం తరఫున గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకల్లో సీఎం జగన్, స్పీకర్ తమ్మినేని సీతారాం, శాసన మండలి ఛైర్మన్ కొయ్యే మోషన్‌రాజు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. Read Also: ఏపీలో కొత్త…
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ని బుధవారం రాజ్‌భవన్‌లో ఆయన నివాసంలో పరామర్శించనున్నారు సీఎం జగన్. ఇటీవల కోవిడ్ నుండి కోలుకున్నారు గవర్నర్ దంపతులు. సతీసమేతంగా గవర్నర్ దంపతులను పరామర్శించనున్నారు సీఎం జగన్. కరోనా తర్వాత ఏర్పడిన ఆరోగ్య సమస్యలతో హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ దంపతులు బిశ్వభూషణ్ హరిచందన్, సుప్రవ హరిచందన్ గత గురువారం ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి అయిన సంగతి తెలిసిందే. ఇంతకుముందు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో కొవిడ్ చికిత్స తీసుకున్నారు.…
అస్వస్థతకు గురై హైదరాబాద్ వచ్చి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను మరోసారి పరామర్శించారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతుండగా.. శాసనసభ విరామ సమయంలో గవర్నర్‌ను ఫోన్‌లో పరామర్శించిన సీఎం.. ఆయన ఆరోగ్య పరిస్ధితిపై ఆరా తీశారు.. నిన్ననే వైద్యులతో ఆరోగ్య పరిస్థితిపై మాట్లాడానని.. సరైన సమయంలో ఆస్పత్రిలో చేర్చినట్లు వైద్యులు చెప్పారనే విషయాన్ని గుర్తు చేసుకున్నారు.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు సీఎం వైఎస్ జగన్.…
ఆంధ్రప్రదేశ్‌లో బూతుల వ్యవహారం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది.. ఆ తర్వాత దీక్షలు, ఆందోళనలు, నిరసనలు ఇలా ఒక్కటేంటి.. బూతులు వెతికిమరీ తిట్టేస్థాయికి వెళ్లిపోయింది. ఆ తర్వాత చంద్రబాబు హస్తిన పర్యటనకు కూడా హాట్ టాపిక్‌గా మారిపోయింది.. అయితే, ఈ పరిణామాల నేపథ్యంలో.. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌తో భేటీకి సిద్ధం అయ్యారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. రేపు సాయంత్రం 5.30 గంటలకు రాజ్‌భవన్ వెళ్లనున్న ఏపీ సీఎం వైఎస్ జగన్.. గవర్నర్‌తో సమావేశం కానున్నారు.. టీడీపీ…