NTV Telugu Site icon

Adluri Laxman: కేసీఆర్ పాలన అంతా.. నేనే రాజు.. నేనే మంత్రి అన్నట్టు నడిచింది

Adluri Laxman

Adluri Laxman

బీఆర్ఎస్ పై ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్ పాలన అంతా.. నేనే రాజు.. నేనే మంత్రి అన్నట్టు నడిచిందని లక్ష్మణ్ ఆరోపించారు. కాంగ్రెస్ మీద తిరుగుబాటు వస్తుందని కేసీఆర్ అంటున్నారు.. ఆరు నెలల కింద కూడా మూడోసారి తమదే రాజ్యం అన్నారు.. చివరకు ఏమైందని ప్రశ్నించారు. ప్రజలు కాంగ్రెస్కు క్లియర్ తీర్పు ఇచ్చారని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు స్వేచ్ఛగా ఉన్నారన్నారు. ఇదిలా ఉంటే.. గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్, మంత్రులు సెక్రటేరియట్ కే రాలేదని ఆరోపించారు.

Read Also: Harish Rao: రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు..

కాంగ్రెస్ మంత్రులు, సీఎం సెక్రటేరియట్ కు వస్తున్నారు.. ప్రజలు వచ్చి సమస్యలు చెప్పుకుంటున్నారని లక్ష్మణ్ తెలిపారు. అధికారంలోకి వస్తాం అని అంటున్న కేసీఆర్… ఎంపీ ఎన్నికల్లో ఏం జరిగిందో చూశారుగా అని ఎద్దేవా చేశారు. పోలింగ్ లో చేతులు ఎత్తేసే.. బీజేపీకి మద్దతు ఇచ్చింది మీరని మండిపడ్డారు. మరోవైపు.. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాకా.. నాలుగు గ్యారెంటీలు అమలు చేశారని తెలిపారు. చెప్పిన మాట ప్రకారం రుణమాఫీ చేయబోతున్నామన్నారు.

Read Also: Breaking News: రాజ్యసభ సభ్యత్వానికి కే. కేశవరావు రాజీనామా..

కేసీఆర్, కేబినెట్ మంత్రులనే కలవలేదని.. సీఎం రేవంత్ రెడ్డిని తాము రోజు కలుస్తున్నామని లక్ష్మణ్ చెప్పారు. ఉద్యమ పార్టీ అంటున్నావు.. ఆరు నెలల కూడా పార్టీని నిలబెట్టుకోలేక పోతున్నావని విమర్శించారు. ఓడిపోయిన తరువాత కూడా జనంలోకి రావడం లేదన్నారు. మళ్ళీ ఫాంహౌస్ కే పరిమితం అయ్యారని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు.