Site icon NTV Telugu

Duddilla Sridhar Babu : ఇచ్చిన హామీలను ఒకటి తర్వాత ఒకటి నెరవేర్చుతున్నాం

Duddilla Sridhar Babu

Duddilla Sridhar Babu

Duddilla Sridhar Babu : రాష్ట్రంలోని ప్రతి నిరుపేద కుటుంబం కడుపు నిండా తినడమే లక్ష్యంగా ప్రభుత్వం సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని బీఎల్ఎం గార్డెన్ లో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తో కలిసి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పటికి ఇచ్చిన హామీలను ఒక్కొకటిగా నేరవేరుస్తూనే గత ప్రభుత్వం చేయలేని ఒక చరిత్రాత్మకమైన పనిని కేవలం సంవత్సరంన్నర కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసి చూపెట్టారని ఆయన స్పష్టం చేశారు.

గతంలో రేషన్ బియ్యం పంపిణీలో మాఫియాలు ఉండేవని ఇప్పుడు వాటిని శాశ్వతంగా నిర్మూలించామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయినప్పటికి పంటలు సాగు విస్తారంగా పండినాయని, రైతులకు కూడా బోనస్ కూడా ఇవ్వడం జరిగిందని మంత్రి అన్నారు. రాబోయే రోజుల్లో ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒకటి తర్వాత ఒకటి నెరవేర్చి, మాట మీద నిలుస్తుందని ఆశభావం వ్యక్తం చేశారు.

Fire Catches Car: శ్రీశైలం ఘాట్‌ రోడ్డులో భక్తులకు తప్పిన ప్రమాదం..

Exit mobile version