Duddilla Sridhar Babu : ఇచ్చిన హామీలను ఒకటి తర్వాత ఒకటి నెరవేర్చుతున్నాం
- జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు
- రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పటికి ఇచ్చిన హామీలను ఒక్కొకటిగా నెరవేర్చుతున్నాం
- గత ఒక చరిత్రాత్మకమైన పనిని కేవలం సంవత్సరంన్నర కాలంలో సీఎం రేవంత్ రెడ్డి చేసి చూపించారు : మంత్రి శ్రీధర్ బాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Duddilla Sridhar Babu : రాష్ట్రంలోని ప్రతి నిరుపేద కుటుంబం కడుపు నిండా తినడమే లక్ష్యంగా ప్రభుత్వం సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని బీఎల్ఎం గార్డెన్ లో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తో కలిసి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పటికి ఇచ్చిన హామీలను ఒక్కొకటిగా నేరవేరుస్తూనే గత ప్రభుత్వం చేయలేని ఒక చరిత్రాత్మకమైన పనిని కేవలం సంవత్సరంన్నర కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసి చూపెట్టారని ఆయన స్పష్టం చేశారు.
గతంలో రేషన్ బియ్యం పంపిణీలో మాఫియాలు ఉండేవని ఇప్పుడు వాటిని శాశ్వతంగా నిర్మూలించామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయినప్పటికి పంటలు సాగు విస్తారంగా పండినాయని, రైతులకు కూడా బోనస్ కూడా ఇవ్వడం జరిగిందని మంత్రి అన్నారు. రాబోయే రోజుల్లో ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒకటి తర్వాత ఒకటి నెరవేర్చి, మాట మీద నిలుస్తుందని ఆశభావం వ్యక్తం చేశారు.
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
Fire Catches Car: శ్రీశైలం ఘాట్ రోడ్డులో భక్తులకు తప్పిన ప్రమాదం..
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!